Begin typing your search above and press return to search.
క్రికెట్లోకి కుల పిచ్చి..ఓన్లీ బ్రాహ్మణులకే టోర్నమెంట్!
By: Tupaki Desk | 31 Dec 2020 4:24 AM GMTఇప్పటిదాకా కుల జాడ్యం రాజకీయాలు, ఇతర రంగాల వరకే పరిమితమైంది..ఇంకా ఆటల్లోకి మాత్రం రాలేదనే సంతోషం ఉండేది. మనదేశంలో ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ సహా ఎన్నో ఆటల్లో కుల, మతాలకు అతీతంగా ఆటగాళ్ళకు ప్రోత్సాహం అందుతోంది. జనాలు కూడా అందరినీ ఆదరిస్తున్నారు. అయితే తాజాగా ఆటల్లోకి కుల జాడ్యం పాకుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వివరాలతో కూడిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హైదరాబాద్ లో ఉన్న నాగోల్ లో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పోస్టులో వివరాలు వెల్లడించారు.
కానీ ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం ఈ టోర్నమెంట్ ఈ డిసెంబర్ 25, 26వ తేదీల్లో ఇప్పటికే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోస్టు కరపత్రంలో మెన్షన్ చేసిన నిబంధనలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ నిబంధనలు చదివి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకు ఆ కరపత్రంలో ఏమున్నాయి అంటే..ఆటగాళ్ళు కేవలం బ్రాహ్మిణ్ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. బ్రాహ్మిణ్ అని నిర్ధారించే ఐడీ కూడా తీసుకురావాలని కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ టోర్నమెంట్ నిర్వహణపై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఆటల్లోకి కులాన్ని కూడా లాగారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక సామాజిక వర్గమే కలసి మ్యాచ్ లు ఆడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
స్థానికంగా ఉన్న సంస్థల అనుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహించామని వచ్చిన ఆదాయం ఎన్జీవోలకు అప్పగించినట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన 24 జట్లు ఈ టోర్నమెంట్లో పాటిస్పేట్ చేసాయి. ఏదేమైనా ఒక కులానికి చెందిన ఆటగాళ్ళతో దేశ స్థాయిలో టోర్నీ నిర్వహించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.