Begin typing your search above and press return to search.

ఏళ్లుగా చైనాలో సీసీపీ పాలన.. ఎలా సాధ్యమైంది?

By:  Tupaki Desk   |   2 July 2021 1:30 AM GMT
ఏళ్లుగా చైనాలో సీసీపీ పాలన.. ఎలా సాధ్యమైంది?
X
మావో శకం నుంచి ఈనాటి వరకు చైనా తనదైన రీతిలో దూసుకుపోతోంది. 1949 అక్టోబర్ 1 న అధికారం చేపట్టిన సీసీపీ నేటికీ పరిపాలన చేస్తోంది. అయితే అందుకు బలమైన కారణం దానికి ఎదురైన వ్యతిరేకతను అణచివేయడం. కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించిన వారిపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.

చైనా ప్రజల జీవితంపై కమ్యూనిస్టు ప్రభావం అధికంగా ఉంటుంది. దేశ పాలనలో ఆ పార్టీకి పూర్తి పట్టు ఉంది. ప్రభుత్వం, పోలీసు, మిలటరీ, మీడియా ఇలా అన్ని వ్యవస్థలపై నియంత్రణ ఉంది. సీసీపీకి 9 కోట్ల మంది కార్యకర్తలు ఉంటారు. వారిలో సామాన్య సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు ఉంటారు. పిరమిడ్ ఆకారంలో ఉండే వ్యవస్థలో ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తారని సమాచారం.

నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనే పార్లమెంట్ వ్యవస్థ ఉంటుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఇది ఆమోదిస్తుంది. ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం నినాదాన్ని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అక్కడ ఇతర చిన్న చిన్న పార్టీలున్నా అవి సీసీపీకి మద్దతు ఇవ్వాల్సిందే. 1976కు ముందు మావో జెడాంగ్ నాయకత్వంలో పాత విధానాలను అనుసరించిన డ్రాగన్... ఆ తర్వాత సంప్రదాయ విధానాలకు స్వస్తి చెప్పింది. సంస్కరణల బాటపట్టి బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది.

చైనాలో సుమారు 7 శాతం మంది సీసీపీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. వారు ప్రభుత్వం లేదా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే బహిరంగంగా క్షమాపమ చెప్పాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవరించిన వారిపై డ్రాగన్ ప్రభుత్వ ఏమాత్రం కనికరం చూపదు.

అక్కడ శక్తివంతమైన పొలిట్ బ్యూరో ఉంటుంది. అందులో స్టేట్ కౌన్సిల్, సెంట్రల్ మిలిటరీ కమిషన్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనే మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఆ దేశానికి వెన్నెముకలా పని చేస్తాయి.

ప్రభుత్వంపై వ్యతిరేకతను అసలు సహించబోదు. అందులో కిందిస్థాయి వ్యక్తుల నుంచి అధికారంలో ఉన్న నాయకుల వరకు ఒకేలాంటి నిబంధనలు వర్తింపజేస్తుంది. మీడియా, సోషన్ మీడియా, అంతర్జాలం, సెన్సార్ విధానాలపై ఆ దేశానికి పూర్తి స్థాయి పట్టు ఉంది. సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు తన భద్రతను పటిష్ఠం చేసుకుంటుంది. వ్యతిరేకత పెరగకుండా వివిధ చర్యలు చేపడుతూ సీసీపీ జాగ్రత్త పడుతుంది.