Begin typing your search above and press return to search.
వినతిపత్రాన్ని వీఆర్ఏ నేత ముఖంపై విసిరికొట్టిన కేసీఆర్.. ఆగ్రహం?
By: Tupaki Desk | 2 Oct 2022 5:38 AM GMTతాను చెప్పినట్టుగా వింటే వారికి డీఏలు, జీతాల పెంపు.. ఇతర అన్నింటిని కేసీఆర్ చేసేస్తారని.. వినకపోతే చుక్కలు చూపిస్తారని పేరుంది. తెలంగాlలో అవినీతికి పర్యాయపదంగా మారిన వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్ కూకటి వేళ్లతో సహా పెకిలించాడు. అవినీతితో పంకిలమైన వీఆర్వోలను వేరే శాఖలోకి మార్చి వారి పోస్టింగ్ కు సరిపడా ప్రజాసేవలో పాల్గొనే పనులనే అప్పగించారు. నీటి పారుదల, పంచాయతీరాజ్, ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించారు.
వీఆర్వోలను విజయంతంగా మార్చేసిన కేసీఆర్.. గ్రామాల్లో క్షేత్రస్తాయిలో విధులు నిర్వహించే వీఆర్ఏలను ఏం చేయాలో అర్థం కాక వదిలేశారు. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. మొన్న అసెంబ్లీని ముట్టడించారు. నిన్న వరంగల్ వెళుతున్న కేసీఆర్ ను అడ్డగించారు.
గతంలో హైదరాబాద్ లో ఆందోళన చేసిన వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ మాట్లాడి స్వయంగా హామీలిచ్చారు. మీ సమస్యలపై చర్చించి రండి పరిష్కరిస్తామన్నారు. కానీ వీరు ఊరుకోకుండా నిన్న కేసీఆర్ కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. అసలే కేసీఆర్.. పైగా ‘దేశ్ కీ నేత’ మూడ్ లో ఉన్నారు. ఊరుకుంటాడా? అందుకే ఫైర్ అయ్యారు.
వరంగల్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ తన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్వించారు. ఈసమయంలో కేసీఆర్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు అక్కడికి వచ్చారు. తొలుత నలుగురు వీఆర్ఏలను లోపలికి తీసుకెళ్లారు.
వీఆర్ఏల జేఏసీ హన్మకొండ జిల్లా కార్యదర్శి సతీష్ ఒక్కడినే కేసీఆర్ ను కలిసేందుకు అనుమతించగా.. ఆయన కేసీఆర్ కు వినతిపత్రం అందించారు. సీఎం వినతిపత్రం చదువుతుండగా.. సతీష్ తమ సమస్యలను వివరించారు. దీంతో కోపం నశాలానికి ఎక్కిన కేసీఆర్ వినతిపత్రాన్ని సతీష్ వైపు విసిరేస్తూ సమ్మె విరమించాలని చెప్పినా వినడం లేదని.. తరచూ కాన్వాయ్ లకు అడ్డుపడుతున్నారని మండిపడినట్లు సమాచారం. దీంతో వీఆర్ఏలతోపాటు పాటు అక్కడున్న నేతలు ఆశ్చర్యపోయినట్టు వీఆర్ఏలు చెబుతున్నారు. లోపల ఏం జరిగిందో కానీ.. బయటకొచ్చాక మాత్రం వీఆర్ఏలు కేసీఆర్ ప్రవర్తించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.