Begin typing your search above and press return to search.

కేసీఆర్ తోనే గేమ్సా.. ఎంత ధైర్యం?

By:  Tupaki Desk   |   26 Oct 2019 8:40 AM GMT
కేసీఆర్ తోనే గేమ్సా.. ఎంత ధైర్యం?
X
హుజూర్ నగర్ ఎన్నికలకు రెండు రోజుల ముందు కేసీఆర్ సభ నిర్వహించి అక్కడి ప్రజల ఓట్లను పొందాలని టీఆర్ ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. కానీ నాడు వరుణుడు కేసీఆర్ రాకను అడ్డుకున్నాడు. భారీ వర్షంతో కేసీఆర్ హెలీక్యాప్టర్ ఎగరలేదు. కేసీఆర్ రాలేదు. హుజూర్ నగర్ లో కేసీఆర్ సభ జరగకపోయినా ఓటర్లు మాత్రం గులాబీపార్టీనే గెలిపించారు.

ఇక రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెతో ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడం.. సమ్మెకు మద్దతు - ప్రజలకు రవాణా ఇబ్బందులు ఇలా ఇన్ని సమస్యల్లోనూ టీఆర్ ఎస్ ను హుజూర్ నగర్ లో జనాలు గెలిపించడంతో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ శ్రేణులు అంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ అనుకోని వరాన్ని పంచుకునేందుకు కేసీఆర్ అదే హుజూర్ నగర్ లో ఇప్పుడు ‘కృతజ్ఞత సభ’ పెట్టారు.

అయితే మొన్న కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకున్న వరుణుడు.. ఇప్పుడు ఆయన ఆనందాన్ని పంచుకుంటానంటే కూడా అడ్డుకుంటుండడం గమనార్హం.

హుజూర్ నగర్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో కేసీఆర్ హెలీక్యాప్టర్ రావడం కష్టమేనంటున్నారు. ఇక బహిరంగ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. మైదానం బురద మయం కావడంతో సభ శనివారం సాయంత్రం జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా ఉందట.. సాయంత్రం కూడా వాతావరణం అనుకూలించకపోవచ్చనే మాట వినిపిస్తోంది. సో కేసీఆర్ ను హుజూర్ నగర్ కు రాకుండా వరుణుడు అడ్డుకుంటున్నారు. అప్పుడు ఓటర్లను అభ్యర్థించడానికి రానీయలేదు.. ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపడానికి కూడా రానీయకపోవడం విధి వైచిత్యమే మరి.. ఈ పరిణామం చూశాక.. ’కేసీఆర్ నే ఆడుకుంటున్న వరుణుడు.. ఎంత ధైర్యం’ అంటూ సోషల్ మీడియా సెటైర్లు పడుతున్నాయి.