Begin typing your search above and press return to search.
రామోజీ ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు.. అంగరంగ వైభవంగా మనవరాలి పెళ్లి!
By: Tupaki Desk | 17 April 2022 4:30 PM GMTతెలుగు మీడియా మొఘల్ రామోజీరావు ఇంట్లో మరోవివాహం జరిగింది. ఆయన పెద్ద కుమారుడు చెరుకూరి కిరణ్ ప్రభాకర్, శైలజ దంపతుల రెండో కుమార్తె బృహతి వివాహం జరిగింది. కిమ్స్ ఆసుపత్రుల ఎండి దండమూడి అమర్ మోహన్ దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్‌తో బృహతి కల్యాణం కమనీయంగా సాగింది. అచ్చతెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లి సందడికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. బృహతి ఉన్నత చదువులు పూర్తి చేసి.. ప్రస్తుతం `ఈటీవీ భారత్` వ్యవస్థాపక ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె సారథ్యంలోనే ఈటీవీ భారత్‌ను స్థాపించి.. నిర్వహిస్తున్నారు.
వరుడు వెంకట్ అక్షయ్.. దండమూడి అమర్ మోహన్‌దాస్, అనితల కుమారుడు. వివాహ మహోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా రాజకీయ, న్యాయ, సినీ, వైద్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
రాత్రి 12.18 గంటలకు సంప్రదాయబద్ధంగా జీలకర్ర-బెల్లం కార్యక్రమం నిర్వహించారు. కల్యాణఘట్టానికి ముందు.. వేద పండితుల మంత్రాశీర్వచనాలు, మంగళ వాయిద్యాల నడుమ వధూవరులకు పుష్పఛత్రాలు పట్టి.. వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. కల్యాణ వేదికను ఆలయ సంప్రదాయ నిర్మాణశైలి ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సప్తవర్ణ రంజితంగా.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, విభిన్న పుష్పాలంకరణలతో వివాహవేదిక ప్రాంగణమంతా నయన మనోహరంగా కనిపించింది. బంధు మిత్రుల సాక్షిగా వెంకట్ అక్షయ్, బృహతి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఈ వివాహ మహోత్సవానికి అతిరథ మహారథులైన ఎందరో ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ విభాగం జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని నాని, సీఎం రమేశ్, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.రామ్మోహన్‌రావు వధూవరులను ఆశీర్వదించారు.
న్యాయమూర్తులు కూడా..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ బి.కృష్ణమోహన్, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) డి.వెంకటరమణ, ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యురాలు జస్టిస్ రజని, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధారాణి, జస్టిస్ పి.మాధవీదేవి, జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్, జస్టిస్ జె.శ్రీదేవి, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్, జస్టిస్ జి.అనుపమా చక్రవర్తి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్ ఎ.సాంబశివరావు నాయుడు, జస్టిస్ డి.నాగార్జున, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వధూవరులను ఆశీర్వదించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబసమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సినీ ప్రముఖులు
మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ నిర్మాతలు మురళీమోహన్, అల్లు అరవింద్, అశ్వనీదత్, డి.సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, కె.ఎల్.నారాయణ, శోభు యార్లగడ్డ, జెమినీ కిరణ్, అక్కినేని నాగసుశీల, దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎస్.ఎస్.రాజమౌళి, సతీమణి రమా రాజమౌళి, బోయపాటి శ్రీను, వైవీఎస్ చౌదరి, ప్రముఖ నటులు మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, అలీ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, నరేశ్, రాజశేఖర్, జీవిత, యమున, జయసుధ, గాయని సునీత, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, యాంకర్లు సుమ, ఉదయభాను వధూవరులను ఆశీర్వదించారు. ఇలా ఎందరో మహానుభావులు రామోజీ మనవరాలి వివాహానికి హాజరై ఆశీస్సులను అందించారు. ఆద్యంత అత్యంత రమణీయంగా శోభస్కరంగా సాగిన పరిణయ వేడుకు సుమారు 10 గంటలపాటు ఈటీవీ అన్ని చానెళ్లలోనూ లైవ్ ప్రసారం చేశారు. దీనిని వీక్షించిన నెటిజన్లు.. వింటే రామాయణం.. చూస్తే.. రామోజీ ఇంట వివాహమే చూడాలని కామెంట్లు చేయడం గమనార్హం.