Begin typing your search above and press return to search.
దిశబిల్లు ఉపసంహరణ..! త్వరలో మరో బిల్లు రూపకల్పన
By: Tupaki Desk | 3 Dec 2020 4:35 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ బిల్లును ఉపసంహరించుకున్నది. 2019, నవంబరు 27న హైదరాబాద్ శివారు ప్రాంతంలో దిశ అనే వైద్యురాలిపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా దిశ బిల్లును తీసుకొచ్చారు. అయితే ఈ బిల్లుపై తొలినుంచి కేంద్ర హోంశాఖ అభ్యంతరాలు చెబుతూ వస్తున్నది. ఈ బిల్లును హడావుడిగా తీసుకొచ్చారని.. కేంద్ర చట్టాలకు లోబడి బిల్లు రూపకల్పన జరగలేదని కేంద్రం వాదించింది.
దీంతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు ఢిల్లీకి వెళ్లి తమ వాదనలు వినిపించారు. సవరణలు పొందుపరిచారు. అయినప్పటికీ కేంద్రహోంశాఖ ఈ చట్టాన్ని అంగీకరించలేదు. ఈ చట్టానికి ఎంతో ప్రజాదరణ వచ్చింది. ఈ చట్టాన్ని అమలుచేసేందుకు ఏపీ వ్యాప్తంగా దిశ పోలీస్స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరకు కేంద్ర మాత్రం అంగీకరించలేదు. ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసే క్రమంలో న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు.
గత ఏడాది డిసెంబరు 13న శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత లాంఛనాలు పూర్తిచేసి కేంద్రం ఆమోదానికి పంపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లులోని ఆరు అంశాలు కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఉన్నాయని కేంద్రం చెబుతున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ ప్రభుత్వాలు రూపొందించి తీసుకొచ్చిన బిల్లులను ఆమోదించిన కేంద్రం.. ఏపీ తీసుకొచ్చిన దిశ బిల్లును మాత్రం తిరస్కరించింది. దీంతో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దిశబిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. త్వరలో మరో బిల్లును తీసుకొచ్చి కేంద్రప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.