Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రాను సెట్ చేసే పనిలో బాబు
By: Tupaki Desk | 13 Feb 2023 4:00 PM GMTఉత్తరాంధ్రా ఏపీలో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయానగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మొత్తం చూస్తే 34 అసెంబ్లీ, అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన సీట్లు 88 అయితే అందులో సగానికి కొంచెం అటు ఇటుగా ఈ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మరో సెంటిమెంట్ కూడా ఉంది.
ఉత్తరాంధ్రాలో గెలిచిన పార్టీయే ఇప్పటిదాకా ఏపీలో అధికారం చేపట్టింది. ఉమ్మడి ఏపీలో కూడా చాలా సార్లు అది రుజువు అయింది. విభజన ఏపీలో 2014లో చంద్రబాబు గెలిచారు అంటే ఉత్తరాంధ్రాలో పాతిక సీట్లు ఆయన పార్టీకి దక్కడం వల్లనే. ఇక వైసీపీ 2019లో బంపర్ విక్టరీ కొట్టింది. 28 సీట్లను గెలిచి తెలుగుదేశాన్ని అరడజన్ కే పరిమితం చేసింది.
ఈ నేపధ్యంలో చంద్రబాబు చూపు ఉత్తరాంధ్రా మీద పడింది. దానికి వైసీపీ దూకుడు కారణం అని చెప్పాలి. వైసీపీ మార్చి నెలలో వరస మీటింగ్స్ ని ఉత్తరాంధ్రాలో పెడుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ తో పాటు జీ 20 సదస్సులకు విశాఖను వేదికగా చేసింది. ఇక ఉగాది వేళ విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ప్రారంభించడానికి జగన్ చూస్తున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో అలెర్ట్ అయిన చంద్రబాబు ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు ఉత్తరాంధ్రాలో సీనియర్ నేతలు ఉన్నా వారి వల్ల పార్టీ బలోపేతం కంటే విభేదాలు వర్గ పోరు ఎక్కువగా ఉందని బాబుకు వస్తున్న నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయ్. అదే టైం లో సీనియర్లు ఇస్తే తమకు టికెట్ లేకపోతే తమ వారసులకు అని పట్టు బట్టి కూర్చున్నారు.
ఇక జూనియర్లను యువతకు ఎదగనీయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దాంతో డేరింగ్ గా చంద్రబాబు సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని తప్పించేశారు. అది ఒక ఝలక్ గా అంతా భావిస్తున్నారు. మరో వైపు వర్గ పోరుని సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లా లో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరవుల మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.
మీడియాకు కూడా నాయకులు ఎక్కుతున్నారు. శ్రీకాకుళంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, మాజీ ప్రెసిడెంట్ కళా వెంకట రావుల మధ్య వర్గ పోరు సాగుతోంది. విజయనగరంలో పూసపాటి రాజావారికి ప్రత్యర్ధి వర్గానికి పోరు సాగుతోంది. మరికొందరు సీనియర్లు పార్టీ కోసం పనిచేయకుండా టికెట్ల టైం కి మాత్రం అధినేత వద్దకు వస్తున్నారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు ఈ నెల 25న విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ సదస్సుకు మూడు జిల్లాల నుంచి వేలాదిగా పార్టీ ప్రతినిధులు పాలుపంచుకుంటారని అంటున్నారు. ఈ సదస్సు ద్వారా బాబు పార్టీకి ఒక సందేశం ఇస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో పార్టీకి ఎవరు పనిచేస్తారు వారే రేపటి ఎమ్మెల్యే అభ్యర్ధులు అని బాబు స్టేట్మెంట్ ఇస్తారని తెలుస్తోంది.
అలాగే పార్టీని పక్కన పెట్టి వర్గ పోరుతోనే టైం పాస్ చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్స్ ఉంటాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ఫోకస్ పెట్టింది. జనసేన కూడా ఈ వైపే చూస్తోంది. దాంతో ఒకనాటి తన కంచుకోటను పదిలపరచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకురావడం కష్టమన్న ఉద్దేశ్యంతోనే బాబు ఈ ప్రాత్నం మీద దృష్టి పెట్టారని అంటున్నారు. ఈసారి బాబు మీటింగ్ సీరియస్ గానే సాగుతుందని, పార్టీ ప్రక్షాళన దిశగానే ఉంటుందని అంటున్నారు. ఈ సమావేశం వచ్చే ఎన్నికల్లో టీడీపీ తమ్ముళ్ళకు దిశా నిర్దేశం చేసేలా ఉంటుందని అంటున్నారు.