Begin typing your search above and press return to search.

ఇంట‌ర్నెట్‌ ను పిచ్చెక్కిస్తున్న బాబు ఫొటో!

By:  Tupaki Desk   |   2 Nov 2018 10:46 AM GMT
ఇంట‌ర్నెట్‌ ను పిచ్చెక్కిస్తున్న బాబు ఫొటో!
X
అధికార‌మే ల‌క్ష్యం. సంపాద‌నే ధ్యేయం... ఇది చంద్ర‌బాబు నినాదం. సిద్ధాంతాలనే రాద్ధాంతం ఏమీ లేకుండా ఏ పార్టీతో అయినా క‌లిసిపోయి ఎప్పుటికేది అవ‌స‌ర‌మో అపుడు ఆ ప‌ని చేస్తూ ఎంచ‌క్కా దూసుకుపోతున్నాడు చంద్ర‌బాబు. అయితే, ఈ విష‌యంలో ఇంతకు మునుపు ఎన్న‌డూ చూడ‌ని వ్య‌తిరేక‌త‌ను చంద్ర‌బాబు చూస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్‌ తో క‌ల‌వ‌డం... అన్న‌దానిపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో నిన్న‌టి నుంచి చంద్ర‌బాబు ట్రోల్ అవుతున్న విధానం చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌నాత‌నంగా టీడీపీని అభిమానిస్తున్న వారు అంద‌రూ కుమిలిపోయిన ప‌రిస్థితి. ఎవ‌రికి వారు త‌మ చుట్టుప‌క్క‌ల వారితో టీడీపీ - కాంగ్రెస్ క‌ల‌యిక‌ను ఎలా స‌మ‌ర్థించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌తం అయ్యే ప‌రిస్థితి.

ఫేస్‌ బుక్‌ - ట్విట్ట‌ర్ ఎక్క‌డ చూసినా దీనిపై సెటైర్లే. వీటిలో హైలెట్ గా నిలిచి ఫొటో ఒక‌టి నిన్న‌టి నుంచి తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. దేశంలో చంద్ర‌బాబు కల‌వ‌డానికి ఇంక ఏ పార్టీ మిగ‌ల్లేదన్న‌ట్లు అన్ని పార్టీల గుర్తులు ఆ ప‌సుపు కండువా మీద వేసి డిజైన్ చేసి ఆ ఫొటో నెటిజ‌న్ల‌కు తెగ న‌చ్చింది. చివ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే సామాన్యులు కూడా దానిని చూసి నవ్వుకుని షేర్ చేసుకుంటున్నారు. బ‌హుశా ఇలాంటి ప‌రిస్థితి దేశంలో ఇంకే పార్టీకి రాలేదేమో మ‌రి.