Begin typing your search above and press return to search.
ఐఏఎస్ ల బదిలీల్లో ఆయనపై బాబు ఫోకస్
By: Tupaki Desk | 7 Feb 2017 11:50 AM GMTఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మహిళా పార్లమెంటు సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఎఎస్ ల బదిలీపై దృష్టి సారించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. టెక్నాలజీని కలెక్టర్ అందిపుచ్చుకున్న తీరు ముఖ్యమంత్రి చంద్రబాబును బాగా ఆకట్టుకుందని, ఆ ఉద్ధేశ్యంతోనే చిత్తూరు జిల్లాకు బదిలీ చేయాలని తలపోసినట్లు తెలుస్తోంది. బాబు కృష్ణా జిల్లా కలెక్టర్ గా యంత్రాంగాన్ని ఉరుకులు - పరుగులు పెట్టించారు. టెక్నాలజీని ప్రభుత్వ పథకాలకు అన్వయించటంలో సఫలీకృతులయ్యారు. దీని ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధిలో తనదైన ముద్రను చాటుకోలేకపోవడంలో ఆశించిన స్థాయిలో లేని చిత్తూరు జిల్లాకు బదిలీ చేసి సొంత జిల్లా మరింత వృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారని సమాచారం.
మరోవైపు జిల్లాలోకి కొన్ని వర్గాలు కలెక్టర్ అహ్మద్ బాబు పరిపాలనపై ఇటు అధికారపార్టీతో పాటు అటు విపక్షాలు సైతం పెదవి విరుస్తుండటం గమనార్హం. పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించటం తప్ప చేసిందేమి లేదని అంటున్నారు. బందరు పోర్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారని, పోర్టు పనులను పట్టాలు ఎక్కించటంలో వైఫల్యం చెందారని అధికార విశ్లేషిస్తున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ దూరం పాటించారన్న విమర్శలు ఉన్నాయి. భూ ఆక్రమణలు పెద్దఎత్తున వెలుగు చూశాయని, కొల్లేరులో ఫారెస్టు సిబ్బందిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దాడులకు పాల్పడిన కలెక్టర్ నోరు మెదపలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జనవరి, 26 రిపబ్లిక్ డే ప్లాగ్ ను నాన్ ఐఎఎస్ లతో ఎగుర వేయించి జిల్లా ప్రతిష్టకు భంగం కల్గించారని కొందరు ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/