Begin typing your search above and press return to search.
బాబు మాట.. ప్రజలకు వినిపిస్తోంది.. నేతలకే వినిపించడం లేదుగా!
By: Tupaki Desk | 23 Feb 2023 6:57 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఒక పిలుపునిచ్చారు. ప్రజల తరఫున గళం వినిపిస్తున్న బడుగు, బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే అధికార పార్టీ నేతలు గన్నవరం హింసకు పాల్పడ్డారని అన్నారు.
ప్రశ్నించే ప్రజలు, ప్రజాసంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే అన్నారు. అంతటితో ఆగకుండా.. ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ఇక, సమష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మన భవిష్యత్తుని.. మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయాలనేది వారి కుట్ర అని బాబు చెప్పుకొచ్చారు.
బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి... ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బా ధ్యత తనపై ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి... ప్రజాస్వామ్యానికి, నియంత పోకడల కు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దీనిపై సంయుక్త యుద్ధానికి, ఉద్యమానికి పిలుపునిస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనికి అందరూ కలిసి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. చంద్రబాబు ఇచ్చిన పిలుపు ప్రజలకు వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ఎలాంటి పిలుపు ఇవ్వకుండానే ప్రజలు స్పందిస్తున్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తున్నారు(బాబు సభలు, సమావేశాలు.. రోడ్‌షోలు సూపర్ హిట్ అవుతున్నాయి కదా!) బాబు వెంటే ఉంటున్నారు. గంటలతరబడి ఆలస్యమైనా..వేచి చూస్తున్నారు.
సో.. బాబు పిలుపు ప్రజలకు వినిపిస్తూనే ఉంది. కానీ.. వినిపించాల్సింది.. మేల్కొనాల్సింది.. ఆయన పార్టీ నాయకులే. 'తప్పించుకుతిరుగువాడు..' అన్నట్టుగా చాలా మంది నాయకులు వ్యవహరిస్తుండడం పార్టీలోనే చర్చనీయాంశం అవుతోంది. సో.. ముందు.. ఇంటి ని చక్కదిద్దుకునే చర్యలను చంద్రబాబు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.