Begin typing your search above and press return to search.

కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణ అనుమతుల్ని ఆర్నెల్లుగా ఇవ్వట్లేదా?

By:  Tupaki Desk   |   11 Jun 2023 9:55 AM GMT
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణ అనుమతుల్ని ఆర్నెల్లుగా ఇవ్వట్లేదా?
X
తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు సంబంధించిన ఒక విషయం తాజాగా బయటకు వచ్చింది. విపక్ష నేతగా ఉన్న ఆయన.. ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడున్న రెండు ఎకరాల స్థలంలో ఆయన సొంతింటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే.. ఇంటి అనుమతుల కోసం ఆర్నెల్లుగా ఎదురుచూడటమే తప్పించి.. నిర్మాణ అనుమతులు రాకపోవటం గమనార్హం.

శాంతిపురం మండలం కడపల్లె పంచాయితీ శివపురం వద్ద.. కుప్పం -పలమనేరు నేషనల్ హైవే పక్కనున్న రెండు ఎకరాల్లో ముందస్తుగా రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టారు.కానీ.. ఇంటి నిర్మాణం మాత్రం షురూ కాలేదు. దీనికి కారణం.. గడిచిన ఆర్నెల్లుగా అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టుకోగా.. ఇప్పటివరకు వాటిని ఓకే చెబుతూ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవటమే కారణం. రైతుల నుంచి కొన్న పొలాన్ని రూల్ ప్రకారం కన్వర్షన్ చేపట్టారు.

ఇందులో భాగంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని అనుమతులు కోరారు. దీనికోసం చంద్రబాబుకు పర్సనల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న మనోహర్ ‘ఉడా’కు అప్లై చేశారు. అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కోర్టు ద్వారా నోటీసులు పంపినట్లు చెబుతున్నారు. ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని.. వచ్చే ఎన్నికల నాటికి అందులో కార్యకలాపాలు ప్రారంభించాలని భావించినా.. అధికారుల నుంచి స్పందన రావటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవటంతో నిర్మాణం ఆగిన విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుకు.. లోకేశ్ కు తెలియజేసినట్లు చెబుతున్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ.. ఈస్థాయిలో ఉండకూడదన్న మాట వినిపిస్తోంది.