Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎదుర్కొన్నే సీనే జగన్ ను ఎదుర్కొంటున్నారా?

By:  Tupaki Desk   |   17 April 2023 6:00 PM GMT
చంద్రబాబు ఎదుర్కొన్నే సీనే జగన్ ను ఎదుర్కొంటున్నారా?
X
ఒకేలాంటి సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో.. దాదాపు అదే లాంటి పరిస్థితిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా బుక్ కావటం.

ఆ సందర్భంలో చంద్రబాబు పేరు తెర మీదకు రావటంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో..తెలంగాణ అధికారులు ఏపీ సీఎంకు నోటీసులు ఇస్తే పరిస్థితేంటి?విచారణకు పిలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో కలిసి గంటల కొద్దీ సమయం మంతనాలకే సమయాన్ని వెచ్చించిన వైనం అందరికి తెలిసిందే.

కట్ చేస్తే.. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి తన బాబాయ్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో తనకు మరో బాబాయ్ అయిన భాస్కర్ రెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. తాజాగా తన సోదరుడు కమ్ ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి? ఏమేం చేయాలన్న దాని పై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లే ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పరిమితం అయ్యారు. పార్టీకి చెందిన అతి ముఖ్యులతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డిభాస్కర్ రెడ్డిలతో కలిసి భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు నిర్వహిస్తున్నారు.

సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో.. విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఈ రోజు ఉదయం (సోమవారం) పులివెందుల నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బయలుదేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ప్రయాణంలో ఈ కేసుపై అవినాశ్ తో చెవిరెడ్డి చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరిస్తున్నట్లు చెబుతున్నారు.

సీబీఐ విచారణ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే వీలుంది? ఎలాంటి పరిస్థితులకు ఏ రీతిలోరియాక్టు కావాలన్న అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితే.. వివేకా హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురైనట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.