Begin typing your search above and press return to search.

అన్నింట్లో పాస్..మన జేఈఈ పరీక్షలో చాట్ జీపీటీ ఫెయిల్

By:  Tupaki Desk   |   13 April 2023 5:18 PM GMT
అన్నింట్లో పాస్..మన జేఈఈ పరీక్షలో  చాట్ జీపీటీ  ఫెయిల్
X
ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌బాట్ చాట్ జీపీటీ ప్రపంచంలోని అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యింది. అయితే మన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇటీవల ఫెయిల్ అయ్యింది. ఆ పరీక్షనే కాదు.. తాజా పరీక్షలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కూడా పాస్ కావడంలో విఫలమైంది..

చాట్‌జిపిటి టాప్ ఇంజనీరింగ్ పరీక్షలో గట్టెక్కలేకపోయింది. చాలా తక్కువ మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయ్యింది. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు పేపర్‌లలోని 11 ప్రశ్నలను మాత్రమే పరిష్కరించగలిగింది. అంతేకాకుండా వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో, ఏఐ ఆధారిత అప్లికేషన్ 45% మార్కులను మాత్రమే సాధించింది. నీట్ పరీక్షలో, 200 ప్రశ్నల సెట్‌ను ప్రయత్నించిన తర్వాత ఈ చాట్ జీపీటీ 800 కి 359 స్కోర్ మాత్రమే చేసింది. ఇది జీవశాస్త్ర విభాగాన్ని మాత్రమే మెరుగ్గా చేసిందని నివేదిక తెలిపింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా ప్రీమియం ఇన్‌స్టిట్యూట్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ఏటా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత టఫ్ పరీక్షగా దీనికి పేరుంది. లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకుంటారు. కానీ చాలా తక్కువమంది మాత్రమే సీట్లు సాధిస్తారు.

చాట్ జీపీటీ ప్రపంచంలోని అన్ని పరీక్షలో పాస్ అవుతూ వస్తోంది. అయితే మన జేఈఈ, సివిల్స్ లో ఫెయిల్ కావడం మన స్టాండర్డ్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాన్-ప్రాఫిట్ ఓపెన్ఏఐ రూపొందించిన సిలబస్ లో మెరుగ్గా ఉంది. శిక్షణ పొందిన బోట్ గా ప్రఖ్యాతి గాంచింది. కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. డైలాగ్ ఫార్మాట్‌లో రూపొందించబడినది. ఫాలో-అప్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, తప్పులను అంగీకరించగలదు, దాదాపు ప్రతి పరీక్షలోనూ పాస్ అయ్యింది. కానీ మన జాతీయ పరీక్షల్లో మాత్రం విఫలం కావడం మనకు గర్వకారణమనే చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సహా చాలా మంది చాట్ జీపీటీని ఒక "విప్లవాత్మకమైనది" అని ప్రశంసించారు. అలాంటిది మన దేశ చదువుల్లో ఓడిపోవడం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.