Begin typing your search above and press return to search.

ఆస్తి కోసం భర్తతో పాటుగా అత్తమామలని చంపించిన కోడలు !

By:  Tupaki Desk   |   13 Nov 2020 10:30 AM GMT
ఆస్తి కోసం భర్తతో పాటుగా అత్తమామలని చంపించిన కోడలు !
X
చెన్నైలో చోటుచేసుకున్న కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన పారిస్‌ కార్నర్ ‌లోని షావుకారుపేటలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈఘోరానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దలీల్‌ చంద్‌ చెన్నై షౌవుకార్‌పేటలో ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. చెన్నై ఎలిఫెంట్ ‌గేట్‌ సమీపంలోని అపార్టుమెంటులో భార్య పుష్పాబాయ్‌ (70), కుమారుడు సీతల్ లతో కలిసి నివసిస్తున్నాడు. కుమార్తె పింక్‌ కు వివాహం కాగా భర్తతో కలిసి చెన్నైలోనే వేరే చోట కాపురం ఉంటోంది. బుధవారం రాత్రి కుమార్తె పింక్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా ఎంతసేపటీకి తీయలేదు.

దీంతో కంగారుపడి నేరుగా తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగా తలపై తుపాకీ పేల్చిన గాయాలతో రక్తపుమడుగులో ముగ్గురూ విగతజీవులై పడి ఉండడంతో కేకలు పెట్టింది. సమాచారం అందుకున్న ఎలిఫెంట్ ‌గేట్‌ పోలీసులు జాగిలం, వేలిముద్రనిపుణులతో అక్కడికి చేరుకున్నారు. సీతల్‌కు వివాహమైనా భార్యతో ఏర్పడిన మనస్పర్థల వల్ల తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మానసిక స్థితి సరిగాలేని సీతల్‌ కు రాజస్థాన్‌ లోని బంధువులెవ్వరూ పిల్లనివ్వకపోవడంతో మహారాష్ట్రకు చెందిన జయమాలతో పెళ్లి జరిపించారు. 14 ఏళ్లపాటు సజావుగా కాపురం చేసిన సీతల్‌ క్రమేణా వేధింపులకు దిగడంతో ఈ ఏడాది జనవరిలో జయమాల భర్తను వదిలిపెట్టి తన ఇద్దరు కుమార్తెలతో పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్త, పోలీసులు తనను వేధిస్తున్నట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూనే పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పింక్‌ తన ఇద్దరు సోదరులతో కలిసి చెన్నైకి వచ్చి ఆస్తిలో వాటా కావాలని సీతల్ ను బెదిరించి వెళ్ళింది. ఇందుకు సంబంధించి చెన్నై ఎలిఫెంట్‌గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాల, ఆమె బాబాయ్, మామ, ఇద్దరు సోదరులను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం సీతల్‌ ఇంటికి వెళ్లి మళ్లీ ఆస్తిని పంచివ్వాలని బెదిరించారు. భరణం కింద రూ.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో వాగ్యుద్ధం చోటుచేసుకోవడంతో దలీల్ ‌చంద్, పుష్పాబాయ్, సీతల్‌ లపై కిరాయి గూండా లు కాల్పులు జరిపి హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.