Begin typing your search above and press return to search.
నిర్మల్ డౌట్ ను నాగర్ కర్నూల్ లో కన్ఫర్మ్ చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 7 Jun 2023 12:46 PM GMTగులాబీ బాస్ కేసీఆర్ మారిపోయారా? ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? ఇంతకాలం శత్రువుగా ఉన్నోళ్లు ఇప్పుడు రహస్య మిత్రుడిగా మారారా? అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణ రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసే ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియా సమావేశం కానీ.. సోషల్ మీడియాలో పోస్టులు కానీ.. వేదిక ఏదైనా సరే.. కేంద్రంలోని మోడీ సర్కారుపై విరుచుకుపడే కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ లు ఇద్దరూ ఇటీవల కాలంలో మోడీ సర్కారుపై ఫైర్ కావటం తగ్గించేయటం తెలిసిందే.
దీనికి సంబంధించిన ఊహాగానాలు కొద్ది వారాలుగా వినిపిస్తున్నా.. దానికి నిజమని నమ్మే ఫ్రూప్ లు దొరకని పరిస్థితి. ఆ లోటును తీరుస్తూ సోమవారం నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలోనూ.. మిగిలిన వేదికల వద్ద మాట వరసకు కూడా మోడీ ప్రస్తావన తీసుకురాలేదు.
ఇటీవల కాలంలో ఎక్కడ మాట్లాడినా.. కేంద్రంపై నిందలు వేయటంతో పాటు.. మోడీ సర్కారు వైఫల్యాల్ని బలంగా ప్రస్తావించేవారు. దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తూ కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేసేవారు.
అసెంబ్లీ ఎన్నికలు నాలుగైదు నెలలకు వచ్చేసిన వేళలో.. తమకు సవాళ్లు విసరుతున్న బీజేపీపై విరుచుకుపడేందుకు భిన్నంగా.. వారిని కానీ వారి పేరును కానీ మాట వరసకు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కేసీఆర్ వైనం తొలిసారి నిర్మల్ సభలో బయటకు వచ్చిందంటున్నారు. అయిన్పటికీ.. ఒక్క సభతో నిర్దారణకు రాలేమన్న వారికి మంగళవారం నాగర్ కర్నూలు సభతో కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతున్నారు.
నిర్మల్ డౌట్ ను నాగర్ కర్నూలు సభతో తేల్చేశారని.. కేసీఆర్ మారిపోయారన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.సొంత పార్టీ నేతలు సైతం బీజేపీపై విరుచుకుపడే తీరును తగ్గించుకోవటం.. తమ ఫోకస్ మొత్తం కాంగ్రెస్ మీద పెట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మల్.. నాగర్ కర్నూలు సభల్లో తన ఫోకస్.. టార్గెట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన కేసీఆర్ తీరును చూసిన తర్వాత.. బీఆర్ఎస్ కు బీజేపీ రహస్య మిత్రుడిగా మారిందన్న మాట వినిపిస్తోంది.
నిర్మల్ సభలో కమలనాథులపై విరుచుకుపడని కేసీఆర్ తీరుతో కాస్తంత విస్మయానికి గురైన వారు.. నాగర్ కర్నూల్ సభలో అయినా బీజేపీపై మండిపడతారని ఆశించారు.అయితే.. నిర్మల్ లో మాదిరే నాగర్ కర్నూల్ లోనూ ఒక్క మాట కూడా అనకుండా ఉన్న వైనం చూశాక.. బీఆర్ఎస్-బీజేపీల మధ్య కొత్త బంధం మొదలైందన్న మాట వినిపిస్తోంది.