Begin typing your search above and press return to search.
క్లోనింగ్ తో మూడు ఆవులను సృష్టించిన చైనా.. ప్రత్యేకతలేంటి?
By: Tupaki Desk | 5 Feb 2023 6:00 AMమనిషి తన అద్భుత మేధాశక్తితో సృష్టికి ప్రతిసృష్టి చేసే స్థాయికి ఎదిగాడు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు కొత్తపుంతలు తొక్కుతుండటంతో రోజుకో కొత్త ప్రయోగం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే మనిషి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అనేక రకాల అంతరించిపోతున్న జంతు జాతులు తిరిగి కాపాడుతున్నాడు. అలాగే తన అవసరాలను తీర్చుకునేందుకు సైతం క్లోనింగ్ ప్రక్రియను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే పలు రకాల జంతువులను మనిషి సృష్టించాడు. అయితే వ్యాపార ధోరణిలో మాత్రం వీటిని వినియోగించిన ఘటనలు తక్కువగా అనే చెప్పొచ్చు. అయితే చైనా మాత్రం తమ దేశంలోని పాల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని దాన్ని క్యాష్ చేసుకునేందుకు క్లోనింగ్ ప్రక్రియను ఆశ్రయిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చైనాలోని నార్త్ వెస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ సహకారంతో క్లోనింగ్ తో మూడు ఆవులు సృష్టించారు. ఈ మూడు ఆవులు పెరిగి పెద్దయ్యాక రోజుకు 15 లీటర్ల చొప్పున 50 లీటర్ల వరకు పాలు ఇవ్వనున్నాయి. ఏడాదికి 18 టన్నుల పాలను ఇవ్వగలవని సైంటిస్టులు చెబుతున్నారు. వాటి జీవిత కాలంలో అవి 100 టన్నుల పాలు ఇస్తాయని పేర్కొంటున్నారు.
గతేడాది చైనా ఈ క్లోనింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. చైనాలోని నార్త్ వెస్ట్ అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ సాయంతో లింగ్‌వు నగరంలోని పాలిచ్చే ఆవుల నుంచి కణజాలాన్ని సేకరించారు. ఐవీఎఫ్ పద్ధతిలో బ్యాచ్ బ్రీడింగ్ టెక్నాలజీ వాడి మూడు క్లోనింగ్ ఆవులను సృష్టించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవులు సృష్టిసామని సైంటిస్టులు చెబుతున్నారు.
ఈ క్లోనింగ్ ఆవుల ద్వారా చైనాలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. పాల ఉత్పత్తుల కోసం చైనా విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీని నుంచి బయట పడేందుకు చైనా క్లోనింగ్ ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. కాగా క్లోనింగ్ ద్వారా పుట్టిన తొలి ఆవు 78 సెం.మీ ఎత్తు ఉండగా 57 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం క్లోనింగ్ సక్సస్ రేటు ప్రపంచవ్యాప్తంగా 17.5 శాతంగా ఉందని నార్త్ వెస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిన్ యాపింగ్ తెలిపారు. క్లోనింగ్ ద్వారా జన్మించిన ఆవులన్నీ వందశాతం ఒకేలా ఉన్నాయి. ఏ ఆవు నుంచి సోమాటిక్ సెల్ సేకరించారో ఆ ఆవులానే రంగు.. లుక్కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటివి మరిన్ని సృష్టించి చైనాలో పాల కొరతను తగ్గించాలని చైనా ప్లాన్ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.