Begin typing your search above and press return to search.

వైజాగ్ సిటీ సెంట్ర‌ల్ పార్కు పేరు మారిపోయింది!

By:  Tupaki Desk   |   8 July 2019 10:35 AM IST
వైజాగ్ సిటీ సెంట్ర‌ల్ పార్కు పేరు మారిపోయింది!
X
విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మైన సిటీ సెంట్ర‌ల్ పార్కు పేరు మారింది. విశాఖ సిగ‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా ఉన్న పార్కుకు దీర్ఘ‌కాలంగా డిమాండ్ లో ఉన్న వైఎస్సార్ సిటీ సెంట్ర‌ల్ పార్కుగా పేరు మార్చారు. ఈ రోజు (సోమ‌వారం) సాయంత్రం ఈ పార్కును కొత్త పేరుతో పిల‌వ‌నున్నారు. అదే స‌మ‌యంలో పార్కులో వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని ఏర్పాటుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న పాత జైలును ప‌డ‌గొట్టి.. 30 ఎక‌రాల విస్తీర్ణంలో పార్కును ఏర్పాటు చేశారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఈ పార్కుకు మంచి పేరు వ‌చ్చింది. అయితే..దీన్నిప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టాల‌న్న‌కుట్ర జ‌రిగింది. ఇలాంటి పార్కు ప్ర‌భుత్వ‌మే ప‌ర్య‌వేక్షిస్తే మంచిద‌ని చెప్పినా గ‌త ప్ర‌భుత్వం చెవికి ఎక్కించుకోలేదు.

న‌గ‌రం న‌డిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున స్థ‌లం ల‌భించ‌ని నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వ నేతృత్వంలో అంద‌మైన పార్కును ఏర్పాటు చేస్తే.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌నంగా ఉంటుంది.అయితే.. దీన్నిప్రైవేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్ట‌టం ద్వారా కొంద‌రు భారీ ప్ర‌యోజ‌నాల్ని పొందాల‌న్న ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ పార్కును ప్ర‌భుత్వ నేతృత్వంలో నిర్వ‌హించ‌టంతో పాటు.. అందులో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టివ‌ర‌కు సిటీ సెంట్ర‌ల్ పార్క్ గా ఉన్న దీని పేరు ఈ రోజు త‌ర్వాత నుంచి వైఎస్సార్ సిటీ సెంట్ర‌ల్ పార్క్ గా మార‌నుంది. అదే స‌మ‌యంలో పార్కులో 11 అడుగుల ఎత్తైన వైఎస్ కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. రానున్న రోజుల్లో ఈ పార్కును మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.