Begin typing your search above and press return to search.
కృత్రిమ పద్దతిలో నాగుపాము పిల్లల్ని పుట్టించారు
By: Tupaki Desk | 24 Jun 2023 5:00 AM GMTపిల్లలకు జన్మనిచ్చేందుకు పాము గుడ్లు పెడుతుందన్న సంగతి తెలిసిందే. ఆ గుడ్లను పొదగని పాములు.. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా పాములు జన్మిస్తాయి.
తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని స్నేక్ హెల్ప్ లైన్ చేసిన పని ఇప్పుడు వార్తగా మారింది. భువనేశ్వర్ లోని ఒక వ్యాపారి ఇంట్లో నాగుపాము కనిపించింది. దీంతో.. వారు ఒడిశా స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు.
వారు రంగంలోకి దిగి.. సదరు నాగుపామును పట్టుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ తనిఖీలు నిర్వహించగా.. పాతిక నాగుపాము గుడ్లు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా సేకరించిన హెల్ప్ లైన్ సభ్యులు.. వాటిని తమ కేంద్రానికి తీసుకెళ్లారు. తమతో తెచ్చిన నాగుపామును అడవిలోకి తీసుకెళ్లి వదిలేయగా.. తాము సేకరించిన నాగుపాము గుడ్లను మాత్రం జాగ్రత్తంగా.. పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉన్న వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించారు.
అలా ఉంచిన గుడ్లలో నుంచి నాగుపాము పిల్లలు పుడుతున్నాయి. పాతిక గుడ్ల నుంచి బయటకు వచ్చిన పాము పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. తేమ.. అధిక వేడి కలిగిన ప్రాంతాల్లో పాములు గుడ్లు పెడతాయని.. ఆ వాతావరణంలో పాము పిల్లలు వాటంతట అవే బయటకు వస్తాయని చెబుతున్నారు. ఇంత భారీగా పాము గుడ్లను సేకరించి.. వాటిని కృత్రిమ పద్దతిలో పిల్లలు పుట్టేలా చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.