Begin typing your search above and press return to search.
బెడిసికొట్టిన ఖుష్బూ వ్యూహం.. నోరు జారినందుకు 30 కేసులు
By: Tupaki Desk | 15 Oct 2020 9:45 AM ISTసీనియర్ నటి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే పోతూ పోతూ తన పాత పార్టీని చెడామడా తిట్టిపోయింది ఈ సీనియర్ నటి కమ్ రాజకీయ నాయకురాలు. అయితే ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఏకంగా తమిళనాడులోని 30 పోలీస్స్టేషన్లలో ఏకకాలంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఖుష్బూకు చిక్కులు తెచ్చిన ఆ వ్యాఖ్యలేమిటే చుద్దాం.. ‘కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లంతా మానసింక వికలాంగులే.. అటువంటి మెంటల్ గాళ్ల పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికే మన దేశంలో వికలాంగులు అనే మాటను నిషేధించారు. వికలాంగులకు ప్రత్యామ్నాయంగా దివ్యాంగులు అనే మాటను వాడుతున్నారు. కానీ ఖుష్బూ మాత్రం తొందర పడి ‘మానసిక వికలాంగులు’ అనే పద ప్రయోగం చేసింది.
ఈ మాటలే ఇప్పుడామెకు కొత్త చిక్కులు పెట్టాయి. తమిళనాడుకు చెందిన దివ్యాంగుల సంఘాలు ఖుష్బూపై మండిపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 30 పీఎస్‌లలో ఖుష్బూపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా తిట్టుకోవాల్సిందని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు ఉపయోగించినట్టు? అంటూ దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రకారం కూడా.. దివ్యాంగులను నిందించడం నేరం. తమిళనాడులోని వివిధ జిల్లాల్లోని 30 పీఎస్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలిపింది. ఖుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ఆమె పలుమార్లు వివాదాల్లో చిక్కుకుంది.