Begin typing your search above and press return to search.
అదానీలకు ఎయిర్ పోర్ట్స్ అప్పగించడం పై మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ !
By: Tupaki Desk | 15 Sep 2020 9:30 AM GMTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా రాజ్యాంగం ప్రకారం సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎయిర్ పోర్ట్స్ ఎమెండ్ మెంట్ బిల్లుపై మంగళవారంనాడు రాజ్యసభలో చర్చ వాడివేడిగా జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీరును కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నిలదీశారు.
రాజ్యసభలో కేసీ వేణుగోపాల్ తొలిసారి ప్రసంగించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను గుత్తకు ఇచ్చే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియాను ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ అదానీగా మార్చేస్తున్నారంటూ తప్పుపట్టారు. ఆరు విమానాశ్రయాల నిర్వహణ, అభివద్ధికి అదానీ గ్రూప్ బిడ్లు గెలుచుకుంది. ఒకే ప్రైవేటు సంస్థకు గుత్తుగా ఎయిర్పోర్ట్లు అప్పగించడం స్పష్టంగా నియమాల ఉల్లంఘనే. సొంత మంత్రులు, శాఖలు ఇచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం తుంగలో తొక్కింది. 6 బిడ్లు అదానీ గ్రూపు గెలుచుకునేలా నిబంధనల్లో మార్పులు చేశారు అని వేణుగోపాల్ విమర్శించారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.