Begin typing your search above and press return to search.
అందరి చూపు ఖమ్మంపైనేనా ?
By: Tupaki Desk | 2 July 2023 10:39 AM GMTతెలంగాణాలో అన్నీ రాజకీయ పార్టీల చూపు ఈరోజు కచ్చితంగా ఖమ్మంపైనే ఉంటుంది. ఎందుకంటే ఖమ్మంలో సాయంత్రం రెండు అతిపెద్ద కార్యక్రమాలు జరగబోతోంది కాబట్టే. ఆ రెండు కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీవే కావటమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. మొదటిదేమో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ. ఇక రెండోదేమో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగర్జన సభలో కాంగ్రెస్ కండువాను కప్పుకోవటం.
రాహుల్ గాంధి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే సందర్భంలో ఖమ్మం హెడ్ క్వార్టర్స్ లో పొంగులేటి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. భట్టి పాదయాత్ర ముగింపుసభ, పొంగులేటి కండువా కప్పుకునే బహిరంగసభ రెండు ఆదివారం సాయంత్రంత ఒకే వేదికమీద జరగబోతోంది. అందుకనే రాహుల్ హాజరవుతున్నారు. కాబట్టే తెలంగాణాలోని యావత్ కాంగ్రెస్ నేతలు రెండురోజుల ముందే ఖమ్మంకు చేరుకునేశారు. రాహుల్ కూడా ఆదివారం సాయంత్రం గన్నవరంకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడినుండి ఖమ్మంకు ప్రత్యేక హెలికాప్టర్లో వస్తారు.
బహిరంగసభ అయిన వెంటనే నేతలతో కాసేపు మాట్లాడి వెంటనే మళ్ళీ గన్నవరంకు వెళ్ళి అక్కడినుండి ఢిల్లీకి వెళ్ళిపోతారు. రాహుల్ హాజరవుతున్నారు కాబట్టే రెండు సభలను కలిపి ఒకే వేదికమీద ఏర్పాటుచేశారు. సరే నేతలు చెప్పుకుంటున్నట్లు లక్షమంది జనాలు హాజరవుతారా లేకపోతే ఐదులక్షల మంది హాజరవుతారా అన్నది ప్రదానంకాదు. ఎందుకంటే పీపుల్స్ మార్చ్ ద్వారా భట్టీ జనాల్లో బాగా కదలిక తెచ్చారనే అనుకోవాలి.
ఇదే సందర్భంగా పొంగులేటి గురించి తెలిసిన వాళ్ళు సభ నిర్వహణపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకనే బీఆర్ఎస్, బీజేపీ నేతల దృష్టిమొత్తం ఖమ్మంపైనే ఉంటుందన్నది. ఈ సభకు హాజరైన జనాలు, వాళ్ళ మూడ్ పైన జనాల స్పందనను పార్టీలు అంచనా వేస్తారు. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని హస్తంపార్టీ నేతలు చెప్పేసుకుంటున్నారు. దీనికి అదనంగా మీడియా కూడా ఖమ్మం సభ గురించి ప్రత్యేకంగా వార్తలు, కథనాలిస్తోంది. అందుకనే రాబోయే ఎన్నికలకు ఖమ్మం బహిరంగసభే సమరశంఖం పూరిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.