Begin typing your search above and press return to search.
కమలం పార్టీలో కలి పుట్టించేస్తున్న రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 19 May 2023 3:30 AM ISTరాజకీయాల్లో ఒక ప్రచారం చాలు మంటలు పుట్టిస్తుంది. ఒక అనుమానం సెగలూ పొగలూ పుట్టిస్తుంది. జరిగింది ఎపుడూ గుట్టుగానే ఉంటుంది కానీ బయట జరిగే ప్రచారమే కొంపలు అంటుకునేలా చేస్తుంది. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అస్త్రంగా తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ బండిని జోరెత్తించేందుకు ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారని ప్రచారం కూడా బయల్దేరింది. దాంతో బీయారెస్ నుంచి బీజేపీ నుంచి చాలా మంది నేతలు టచ్ లో ఉంటారని కూడా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఎలాంటి డౌటూ లేకుండా కొన్ని పేర్లు కూడా చెప్పేసి అర్జంటుగా కాంగ్రెస్ లో చేరాలని ఇన్విటేషన్లు పంపిస్తున్నారు.
మీరు క్షణికావేశంలో బీజేపీలో చేరి ఉంటారు. కానీ ఇపుడు నో ప్రాబ్లం. కాంగ్రెస్ డోర్స్ తెరచే ఉన్నాయి. రావచ్చు. రండి అసలు. నాతో మీకు సమస్య ఉంటే నేను ఒకటికి పది మెట్లు దిగి వస్తాను, ఇక నేను కాదు కాంగ్రెస్ కి అసలైన నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అని అందువల్ల వారిని చూడాలి. కాంగ్రెస్ ని చూడాలి. తెలంగాణాలో కేసీయార్ పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చేందుకు మార్గాలు చూడాలి.
అందువల్ల అంతా కలసి రండి అని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓపెన్ కాల్ ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. ఆయన కొన్ని పేర్లు చెప్పారు. ఈటెల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు కాంగ్రెస్ లో చేరాల్సిందే అని అన్నారు. దీని మీద ఈటెల అయితే గట్టిగా రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లేది లేదని అన్నారు తనను బీయారెస్ అవమానించినపుడు బీజేపీ అండగా నిలబడింది కాబట్టి తాను ఆ పార్టీని వీడిపోను అని అన్నారు.
తెలంగాణాలో బీయారెస్ ని ఢీ కొట్టేది అధికారంలోకి వచ్చేది బీజేపీయే నని ఆయన అన్నారు. ఇక మునుగోడులో బీజేపీలోకి వెళ్లి పోటీ చేసి ఓడిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తాను బీజేపీ లోనే ఉంటాను అంటూనే రేవంత్ రెడ్డితోనే తనకు సమస్య అన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఆయన ఆ పార్టీకి వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది. పైగా ఆయన అన్న గారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎటూ కాంగ్రెస్ లో ఉన్నారు.
ఇంకోవైపు చూస్తే చాలా మంది ఇతర పార్టీల వారే కాదు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. రాజకీయ నాయకులు ఒకరు పిలిచి చేరమన్నారనో లేక మరోటనో పార్టీలు మారరు. వారి ఫ్యూచర్ కి భద్రత ఉంటే కండువాలు మారుస్తారు ఇది లోక విధితమే. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణాలోనూ పుంజుకుంటోంది కాబట్టి ఆ పార్టీ వైపుగా చాలా మంది రావచ్చు
ఇంకో వైపు చూస్తే సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అయితే పదవులు వెంటనే అడగరాదు అని షరతులు పెట్టారు వీహెచ్. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పెట్టిన కలి అయితే ఇపుడు బీజేపీలో కొత్త డౌట్లకు కారణం అవుతోంది. చాలా తొందరలోనే అమిత్ షా తెలంగాణా టూర్ వేయనున్నారని తెలుస్తోంది. బీజేపీలో కొత్త నాయకులు చేరడం అటుంచి ఉన్న నాయకులు జారుతారా అన్న చర్చ అయితే నడుస్తుంది.