Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీ విశాఖ వదిలేస్తేనే బెటర్..!
By: Tupaki Desk | 21 Jun 2023 9:06 AM GMTవిశాఖ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో వ్యాపారాలు చేయను అన్న మాటకు జనసేన గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన వల్లనే విశాఖకు చెడ్డ పేరు వస్తోందని, ఎంపీ ఎంవీవీ విశాఖ వదిలేసి వెళ్తే బెటర్ అని ఆ పార్టీ కార్పోరేటర్ మూర్తీ యాదవ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంపీ ఎంవీవీ భూ కబ్జాలు చేస్తూ విశాఖలో విలువైన భూములను కొట్టేస్తున్నారని, అలాంటి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి మరీ వెనకేసుకుని వస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ మీద జరిగింది కిడ్నాప్ కాదని అది ఒక అక్రమ లావాదేవీలకు సంబంధించిన సెటిల్మెంట్ అని జనసేన నేత బాంబు పేల్చారు. ఆ విషయం మరుగున పరచి తెలివిగా ఎంపీ ఎంవీవీ ఇష్యూని డైవర్ట్ చేసి సానుభూతి కోసం విశాఖలో ఉండను వ్యాపారం చేయను అంటున్నారని మండిపడ్డారు.
ఆయన విశాఖలో వ్యాపారం చేస్తే ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. ఆయన ప్రాజెక్టులు అన్నీ వివాదాల పుట్టేనని, అలాగే ఆయనకు భూ ఆక్రమదారుడిగా జైలుకు వెళ్ళి వచ్చిన చరిత్ర కూడా ఉందని జనసేన కార్పోరేటర్ సంచలన ఆరోపణలు చేశారు.
సరిగ్గా ఏడాది క్రితం అడిషనల్ ఎస్పీ భూముల వివాదం విషయంలో ఎంపీ ఇలాంటి ప్రకటనలే చేశారని, విశాఖను వదిలి వెళ్తాను అని నాడు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ తరువాత సీబీసీ ఎసీ చర్చి లాంటి వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేసి వ్యాపారాలను విశాఖలో చేశారని గుర్తు చేశారు.
ఎంపీగా ఉంటూ ఎంవీవీ టేకప్ చేసేవి అన్నీ వివాదాస్పద ప్రాజెక్టులేనని ఆయన తేల్చేశారు. ఎంపీ చేస్తున్న భూ కబ్జా పనులకు తోడు పోలీసు అధికారులను ప్రభుత్వ అధికారులను నిందిస్తున్నారని, తాను చేపట్టిన ప్రాజెక్ట్ కి సంబంధించిన భూములలో బ్లాస్టింగ్ పనులకు గంటల్లో పర్మిషన్ కావాలని ఆయన డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఒక విధంగా వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ పార్టీ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్న ఎంపీని జగన్ ఎందుకు భరిస్తున్నారని మూర్తీ యాదవ్ ప్రశ్నించడం విశేషం. విశాఖ నిండా ఎంపీ విలువైన భూములు కబ్జా చేస్తూ సెటిలెమంట్స్ చేస్తూ ఉంటే జగన్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా విశాఖ శివారు కూర్మన్నపాలెంలో అత్యంత విలువైన స్థలాన్ని ఎంపీ 99: 1 నిష్పత్తిలో ఎంవీవీ వెంచర్ పేరుతో కొట్టేశారని జనసేన నేత ఆరోపించారు. ఇవి విలువైన క్రైస్తవ భూములని ఆయన పేర్కొన్నారు.
ఇక ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ వ్యవహారంలో చాలా విషయాలు బయటకు రావాలని దీని మీద సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీ అక్రమాల మీద అవినీతి మీద ఈడీ విచారణ చేయాలని కోరారు.
ఈ కిడ్నాప్ కధ వెనక ఉన్న సూత్రధారులను అరెస్ట్ చేస్తేనే విశాఖకు శాంతి దొరుకుతుందని ఆయన అనడం విశేషం. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం పిఠాపురం సభలో విశాఖ ఎంపీకే రక్షణ లేదు అని ఆయనకు మద్దతుగా మాట్లాడి సానుభూతిని చూపిస్తే టీడీపీ మొత్తం చంద్రబాబు సహా ఎంపీ ఎంవీవీ పక్షం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూటే జనసేనకు చెందిన కార్పోరేటర్ మాత్రం ఎంవీవీదే తప్పు అని కిడ్నాప్ కధ వెనక చాలా భాగోతం ఉందని అంటున్నారు.
ప్రత్యర్ధి పార్టీకి చెందిన కూడా వైసీపీని ప్రభుత్వాన్ని ఎంపీ ఇబ్బందులు పెడుతున్నారని కూడా చెబుతున్నారు. మరి వైసీపీ నేతలకు పెద్దలకు ఈ కిడ్నాప్ కధ వెనక ఏమి జరిగిందో తెలుసా. లేక తెలిసి మద్దతు ఇస్తున్నారా లేక అసలు ఏమి జరిగి ఉంటుందని భావిస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నారు.