Begin typing your search above and press return to search.

అవినాష్ కి హై కోర్టులో బిగ్ ట్విస్ట్ ..సీబీఐ కి లైన్ క్లియర్

By:  Tupaki Desk   |   28 April 2023 5:14 PM GMT
అవినాష్ కి హై కోర్టులో బిగ్ ట్విస్ట్ ..సీబీఐ కి లైన్ క్లియర్
X
తెలంగాణా హై కోర్టులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురు అయింది. ఈ రోజు వాదనలు విన్నా కూడా తీర్పు ఇవ్వలేనని న్యాయమూర్తి పేర్కొన్నారని తెలిసింది. జూన్ 5 కి ఈ కేసుని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సీబీఐ అధికారులు తమ విచారణను కొనసాగించుకోవచ్చు అని కూడా కోర్టు పేర్కొనడం విశేషం.

సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఊరటను ఇచ్చే విధంగా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. అయితే దాన్ని కోర్టు తిరస్కరించడమే కాకుండా ఈ కేసుని వాయిదా వేసింది. నిజానికి ఈ కేసులో ముందస్తు బెయిల్ విషయమై గత మూడు రోజులుగా విచారణ సాగుతోంది. ఈ రోజు అనేక కేసులు ఉండడంతో దాదాపు నాలుగు గంటల సమయంలో ఈ కేసుని టేకప్ చేసిన న్యాయమూర్తి ఈ రోజు విచారణ జరిపి తీర్పు ఇవ్వలేమని పేర్కొంది.

అదే సమయంలో ఈ కేసు విషయంలో అర్జెన్సీ ఏమైనా ఉంటే హైకోర్టు ప్రధాన నాయమూర్తి బెంచ్ వద్ద అభ్యర్ధించవచ్చునని, సమ్మర్ వెకేషన్ ప్రత్యేక కోర్టు విచారణను కోరవచ్చు అని జస్టిస్ సురెందర్ బెంచ్ పేర్కొంది. ఈ కేసు అత్యవసరంగా విచారించాలని అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోరినప్పటికీ తాము ఈ కేసులో ఎలాంటి ఆదేశాలు సీబీఐకి ఇవ్వలేమన్న సీబీఐ కూడా ఈ కేసు విషయంలో చేయాల్సింది చేసుకోవచ్చు అని పేర్కొనడం విశేషం.

ఇదిలా ఉండగా అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఆ వెంటనే చీఫ్ జస్టిస్ బెంచ్ వద్దకు వెళ్ళి అర్జంటుగా ఈ కేసుని విచారించాలని కోరారు. అయితే ఇప్పటికిపుడు తాను విచారించలేమని పేర్కొన్నట్లుగా తెలిసింది.
ఇక ఈ కేసులో సమ్మర్ వెకేషన్ కోర్టు ప్రతీ గురువారం విచారణ జరుపుతుందని అక్కడ ఈ కేసుని వేసుకోవచ్చు అని సూచించింది. అయితే ఈ కేసుని వెకేషన్ బెంచ్ కి షిఫ్ట్ చేస్తారా లేదా అన్నది కూదా చూడాలి.

ఇదిలా ఉండగా ఈ కేసులో సీబీఐకి లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. న్యయాపరంగా కూడా రక్షణ లేకుండా పోయింది. దంతో సీబీఐ ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. మొత్తానికి హై కోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి రిలీఫ్ అన్నది దొరకలేదని అంటున్నారు.