Begin typing your search above and press return to search.

ముడి ప‌డ‌ని 'మూడు' కోర్టు తేల్చ‌డ‌మూ క‌ష్ట‌మే.. వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!!

By:  Tupaki Desk   |   12 March 2023 9:00 AM
ముడి ప‌డ‌ని మూడు కోర్టు తేల్చ‌డ‌మూ క‌ష్ట‌మే.. వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!!
X
ఎప్పుడెప్పుడు విశాఖ‌కు వెళ్లిపోదామా.. ఎప్పుడెప్పుడు అక్క‌డ పాల‌నా రాజ‌ధానిని ప్రారంభించేద్దామా? అని వెయ్యిక‌ళ్ల‌తో వేన‌వేల ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత , సీఎం జ‌గ‌న్‌కు ఆ ఆశ‌లు.. కోరిక‌లు.. క‌ల‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వెళ్తే.. ఈ ఉగాది నాటికి విశాఖ‌లో ల్యాండ్ అవ్వాలి. అక్క‌డ నుంచి పాల‌న ప్రారంభించాలి. ఇదీ.. విశాఖ శార‌దా పీఠాధిప‌తి, సీఎం జ‌గ‌న్‌కు ఆధ్యాత్మిక గురువు స్వ‌రూపానందేంద్ర చెప్పిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది.

అయితే.. మూడు రాజ‌ధానుల విష‌యం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు కూడా కొన‌సాగుతోంది. రాజ‌ధాని రైతులు.. ప్ర‌భుత్వం కూడా..కేసుల‌పై కేసులు వేసుకుంటున్నారు. దీంతో విచార‌ణ రెండు కోర్టుల్లోనూ సాగు తోంది. ముఖ్యంగా సుప్రీంలో తేలినా.. హైకోర్టులో విచార‌ణ పెండింగులోనే ఉంది. పోనీ.. సుప్రీంతో ఔను అని అనిపించుకుందామ‌ని భావించినా.. వైసీపీకి సాధ్యం కావ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టికి రెండు సార్లు.. ``వెంట‌నే విచారించ‌డం.. అత్యంత కీల‌కం`` అని స‌ర్కారున్యాయ‌వాది కోర్టుకు చెప్పినా.. కోర్టు మాత్రం వినిపించుకోలేదు.

పైగా.. దీనిపై లోతైన విచార‌ణ చేయాల్సి ఉంద‌ని.. సుప్రీకోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇది రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచారించాల్సిన కేసు అని కూడా తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని కేసు ఈ నెల 28 వ‌ర‌కు సుప్రీకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. వ‌చ్చినా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఒక రోజంతా వాద‌న‌లు వినిపిస్తామ‌ని.. ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో త‌దుప‌రి రోజుల్లో క‌క్షిదారులు.. రైతులు.. పార్టీలు ఇలా.. అనే మంది వాద‌న‌లు వినిపించాల్సి ఉంది.

దీంతో ఉగాది ఎలానూ దాటిపోతుంది. పోనీ.. వ‌చ్చే ఎన్నికల లోపైనా ముడిప‌డుతుందా? అంటే.. క‌ష్ట‌మే. ఇప్ప‌టికిప్పుడు రైతుల‌కు ల‌క్ష కోట్లుక‌ట్ట‌మ‌ని సుప్రీం ఆదేశిస్తే..ప్ర‌భుత్వం చేతులు ఎత్తేయాల్సిందే. సో.. ఎలా చూసుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఈ మూడు ముడిప‌డే అవ‌కాశం లేద‌ని.. వైసీపీ నేత‌లు ఒక నిర్న‌యానికి వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విష‌యాన్నే సెంటిమెంటు అస్త్రంగా మార్చాల‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.