Begin typing your search above and press return to search.

డీఎల్ రాజకీయ అవస్తలు

By:  Tupaki Desk   |   15 April 2023 2:00 PM GMT
డీఎల్ రాజకీయ అవస్తలు
X
రాష్ట్రంలో రాజరెడ్డి రాజ్యాంగం పాతపడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కూడా విసుగొచ్చేసింది. ఇపుడు కొత్తగా వైఎస్ భారతి రాజ్యాంగం మొదలైంది. అవును సీనియర్ నేత, రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు నానా అవస్తలు పడుతున్న డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పిన మాటే ఇది. రాష్ట్రంలో భారతి రాజ్యాంగం నడుస్తోందని డీఎల్ మండిపోయారు. భారతి రాజ్యాంగం నడవటం ఏమిటని అడిగితే మాత్రం డీఎల్ నుండి సమాధానం లేదు.

పైగా జగన్ నుండి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు ప్రాణహాని ఉందని విచిత్రమైన కామెంట్ చేశారు. వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రావటంకోసం జగన్ సెంటిమెంటు కోసం తల్లి, సోదరి ప్రాణాలకు హాని తలపెడుతారంటు నోటికొచ్చింది ఏదేదో మాట్లాడేశారు. బీఆర్ఎ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ఏపీలో సరికొత్త రాజ్యాంగం ప్రకారమే పాలన నడుస్తోందన్నారు. అదేమిటంటే భారత రిజ్యాంగమట. అందుకు ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే మాత్రం సౌండ్ లేదు.

జగన్ పైన డీఎల్ నోటికొచ్చినన్ని శాపనార్ధాలు పెట్టారు. కారణం ఏమిటంటే వైసీపీలో ఉన్నపుడు డీఎల్ ను జగన్ పట్టించుకోలేదు. జగన్ పిలిచి తనను నెత్తిన పెట్టుకుంటాడని డీఎల్ చాలా ఊహించుకున్నారు. అలాంటిదేమీ జరగకపోగా అసలు ఉనికే ప్రశ్నార్ధకమైపోయింది. దాంతో లాభంలేదని అనుకుని జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. జగన్ కు వ్యతిరేకంగా నోటికొచ్చింది మాట్లాడితే చంద్రబాబునాయుడు దగ్గరకు తీసుకుని రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖాయం చేస్తారని అంచనా వేసుకున్నట్లున్నారు.

అయితే డీఎల్ గ్రహించాల్సిందేమంటే టీడీపీ మైదుకూరు నియోజకవర్గంలో కూడా టికెట్ రాదు. ఎందుకంటే ఇక్కడ మాజీ ఎంఎల్ఏ పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు మరికొందరు టికెట్లకోసం పోటీపడుతున్నారు. రాజకీయంగా అవుట్ డేటెడ్ అయిపోయిన డీఎల్ ను ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మాజీమంత్రిలో పెరిగిపోతోంది. దాని ప్రభావమే జగన్ పై నోటికొచ్చిన ఆరోపణలు చేయటానికి ఉసిగొల్పుతోంది. మహా అయితే డీఎల్ చేరటానికి బీఆర్ఎస్ లో అవకాశముంటుందేమో. ఎందుకంటే బీఆర్ఎస్ కొత్తగా ఏపీలోకి అడుగుపెడుతున్న పార్టీ కాబట్టి నేతల కొరత చాలావుంది. ఆలస్యం చేస్తే ఇందులో కూడా అవకాశముండదేమో డీఎల్ ఆలోచించుకుని తొందరపడితే మంచిది.