Begin typing your search above and press return to search.
మంచినీటి కోసం డీ శాలినేషన్ ప్లాంట్
By: Tupaki Desk | 16 Oct 2022 10:30 AM GMTపరిశ్రమలకు మంచినీటిని సరఫరా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం మొదటిసారిగా డీ శాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. పరిశ్రమలంటేనే నీటి ఉపయోగం విపరీతంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ప్లాంట్ స్ధాయినిబట్టి రోజుకు లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటి డీ శాలినేషన్ ప్లాంటు శ్రీకాకుళం జిల్లాలోని మెంటాడ గ్రామంలో ఏర్పాటు కాబోతోంది.
ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రు. 300 కోట్ల అంచనాతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా రోజుకు 35 మిలియన్ లీటర్ల నీరు డీశాలినేషన్ అవుతుంది. అసలు డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది ? ఎందుకంటే జిల్లాలోని రణస్ధలం మండలంలోని పైడిభీమవరం సమీపంలోని ఫార్మసిటీలో దాదాపు 20 భారీ పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమలన్నింటికీ ప్రతిరోజు లక్షల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఇపుడు తమ అవసరాలకు పరిశ్రమలు బోర్లపైన ఆధారపడుతున్నాయి.
ప్రతిరోజు లక్షలలీటర్ల నీటిని బోర్లనుండి తీసేసుకోవటంతో భూగర్భజలాలంతా ఇంకిపోతున్నాయి. దీనికారణంగా తొందరలోనే జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగాన్ని చేయబోతోంది. మెంటాడ గ్రామానికి సముద్రం చాలా దగ్గరలో ఉంది. అందుకనే సముద్రనీటిని తీసుకుని డీశాలినేషన్ చేస్తే అంటే సముద్రనీటిలోని ఉప్పును తీసేస్తే అది మంచినీరుగా మారుతుంది. దాన్ని పరిశ్రమల అవసరాలకు ఉపయోగిస్తే బోర్ల నుండి నీటిని తీసుకునే అవసరం ఉండదని ప్రభుత్వం అనుకుంటోంది. దీనిమీద చేసిన ప్రయోగాలు సక్సెస్ అవటంతో భారీ ప్లాంట్ ఏర్పాటుకు రెడీ అవుతోంది.
మెంటాడలో 50 ఎకరాల్లో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. సముద్రం నుండి పైపుల ద్వారా ప్లాంటుకు నీటిని తీసుకుని ఇక్కడ శుద్ధిచేసి మంచినీటిని పైపుల ద్వారా పరిశ్రమలకు అందించేందుకు ప్లాన్ జరిగింది. ఇదిగనుక నూరుశాతం సక్సెస్ అయితే బహుశా మంచినీటి సరఫరాకు ఇతర ప్రాంతాల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటుచేస్తుందేమో. ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖలోని సముద్రపు నీటిని శుద్ధిచేస్తే ఇళ్ళకు సరఫరా చేయటం వీలవుతుంది. ఎప్పటినుండో చెన్నై జనాల మంచినీటి అవసరాలకు అక్కడి ప్రభుత్వం డీశాలినేషన్ పద్దతిలో నీటిసరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.