Begin typing your search above and press return to search.

వేల కోట్లు ఉన్న బీసీసీఐ కి ఇదేం దరిద్రం.. పిచ్ మొత్తాన్ని కప్పే కవర్లు కూడా లేవా?

By:  Tupaki Desk   |   31 May 2023 2:00 PM GMT
వేల కోట్లు ఉన్న బీసీసీఐ కి ఇదేం దరిద్రం.. పిచ్ మొత్తాన్ని కప్పే కవర్లు కూడా లేవా?
X
బీసీసీఐ తీరు చూస్తే.. కాసుల్నికొల్లగొట్టటం మీద ఉండే ఆలోచనలు.. క్రికెట్ ను డెవలప్ చేయటంమీద ఉండదు. నిత్యం మనీ మేకింగ్ మీదనే తప్పించి..దేశం లోని స్టేడియంలలో మరిన్ని వసతు లు పెరిగేలా ఏమేం చేయాలన్న సూచనలతో పాటు కండీషన్లు పెట్టటం.

అవసరమైతే తానే ముందుకు వచ్చి సదుపాయాల కల్పన కు సంబంధించి సాయంగా నిలవటం లాంటివి చేస్తున్నట్లుగా కనిపించదు. ఐపీఎల్ ఫైనల్ టోర్నీ విషయానికే వస్తే.. అనూహ్యంగా కురిసిన వర్షంతో ఆట కు అంతరాయం కలగటమే కాదు.. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మ్యాచ్ ను నిర్వహించలేని పరిస్థితి.

రిజర్వు డే ఉండటంతో సోమవారం మ్యాచ్ ను నిర్వహించారు. ఆ రోజు కూడా వర్షం పడటం.. పిచ్ మొత్తం బురదగా మారటం.. దాన్ని ఆరబెట్టేందు కు గ్రౌండ్ మెన్స్ తీవ్రంగా శ్రమించాల్సి రావటం తెలిసిందే. పిచ్ మొత్తాన్ని కప్పేసే కవర్లు అంత పెద్ద స్టేడియం కు లేకపోవటం ఏమిటి? స్టేడియంలో ఏమేం ఉండాలన్న విషయం పై బీసీసీఐ తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఒకవేళ స్టేడియం ను నిర్వహించేవారు చేయట్లేదనే అనుకుందాం. క్రికెట్ మీద వేలాది కోట్లు అర్జిస్తున్న బీసీసీఐ దేశంలోని గ్రౌండ్ల కు పిచ్ మొత్తాన్ని కప్పేసే కవర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే పోయేదేమిటి?

సామాన్యుడే కాదు.. నిరుపేద సైతం తాను కొనే సబ్బు కు జీఎస్టీ కట్టేయాల్సిందే. ఆసుపత్రికి వెళ్లినా జీఎస్టీ మోత తప్పదు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా చెప్పే బీసీసీఐ కు మాత్రం నేటికి ఆదాయపన్ను మినహాయింపు ఉండటం దేనికి నిదర్శనం? ఎప్పటికప్పుడు వేలాది కోట్ల ను తమ ఖాతాలోవేసుకోవటమే తప్పించి.. క్రికెట్ స్టేడియంల ను మరింత సొగసుగా తయారు చేసి.. ప్రేక్షకుల కు మరింత సౌకర్యవంతంగా కలిగేలా ఎందుకు ప్రయత్నం చేయరు? ఐపీఎల్ మ్యాచ్ లకు డిమాండ్ ఉన్న మ్యాచ్ లకు ఎక్స ట్రా ధర పెట్టి మరీ అభిమానుల వద్ద లాగేస్తున్న బోర్డుకు.. వర్షం కారణంగా తడిచే పిచ్ ను సేవ్ చేయటానికి వీలుగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న సోయి లేకపోవటం దేనికి నిదర్శనం?

ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా బెంగాల్ క్రికెట్ సంఘ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్ టోర్నీ కి ముందు నాటి కి ఈడన్ గార్డెన్ లో వర్షం వచ్చే వేళకు మైదానాన్ని మొత్తాన్ని కప్పే కవర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న సూచన చేయటం కనిపిస్తుంది. స్నేహశిష్ సూచన తర్వాత అయినా బెంగాల్ క్రికెట్ సంఘ అధ్యక్షుడి మాటకైనా బీసీసీఐ తన మొద్దు నిద్రను వదులుతుందా? తనకున్న అపార సంపద నుంచి కాసిన్ని డబ్బుల్ని తీసి ఖర్చు చేస్తుందేమో చూడాలి.