Begin typing your search above and press return to search.

పండక్కి అల్లుడ్ని పిలుస్తారు కానీ.. మొగుడ్ని రమ్మంటారా?

By:  Tupaki Desk   |   11 Nov 2020 8:00 AM IST
పండక్కి అల్లుడ్ని పిలుస్తారు కానీ.. మొగుడ్ని రమ్మంటారా?
X
మీడియాకు సోషల్ మీడియా అదనంగా చేరిన చందంగానే ఇప్పుడు రాజకీయాల్లో ఉండాల్సిన గౌరవ మర్యాదలు అస్సలు ఉండని వైనం తెలిసిందే. రాజకీయాలే కాదు.. మీడియా.. సోషల్ మీడియాలోనూ గతంలో ఏదైనా ఒక మాట అనాలంటే సవాలచ్చ ఆలోచించేవారు. ఇప్పుడు అంతలా ఆలోచనలతో చించేటోళ్లు బాగా తగ్గిపోయారు. అవకాశం లభించాలే కానీ.. ఎవరినైనా సరే.. ఎంతమాట అయినా అనేసే పరిస్థితి.

గతంలో పాత్రికేయం అంటే హుందాగా వ్యవహరించటం.. గౌరవ మర్యాదలతో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడటం ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అవకాశం లభించాలే కానీ కడిగిపారేయటమే. ఎవరో ఏదో అనుకుంటున్నారని అస్సలు అనుకోకుండా.. మనసుకు అనిపించేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోనూ దుబ్బాక ఉప ఎన్నిక వ్యవహారం ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్ అని తేల్చటమే కాదు.. వారి తీరు గెలిచేసినట్లుగా ఉండేది. ఎత్తులు.. పైఎత్తులు.. మొత్తంగా బీజేపీ చాపకింద నీరులా చొచ్చుకుపోతుంటే.. గులాబీ నేతలు.. మాత్రం గెలుపు ధీమాను ప్రదర్శించేవారు. అంతేకాదు.. మిగిలిన అభ్యర్థుల్ని ఉద్దేశించి.. ఎక్కసం ఎటకారం చేసేసిన పరిస్థితి.

ఇంత చేసినా.. కమిట్ మెంట్ విషయంలో కమలనాథులతో పోటీ పడలేని పరిస్థితి. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తన ప్రచారంలో తలమునకలైన వారు.. బోలెడన్ని మీమ్స్ ను.. పొట్టి వీడియోల్ని రూపొందించి.. వైరల్ చేసే వారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటున్న వేళ.. కమలనాథులు.. వారి కార్యకర్తలు.. అభిమానుల ఆనందం అంబరానికి అంటింది. అదే సమయంలో ఎన్నికల వేళ తమకు చుక్కలు చూపించిన గులాబీ నేతలకు.. ఎన్నికల తర్వాత కూడా అదే ప్రోగ్రామ్ ను షురూ చేశారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోల్లో అందరి చూపులు తమమీద పడేలా చేసిన వీడియోలో.. కేటీఆర్.. హరీశ్ రావు.. రఘునందన రావుల ఫోటోల్ని చూపించి.. వీరెవరు.. వీరవరు అంటూ చివర్లో కేసీఆర్ గాల తీసేలా సమాధానం రావటం గమనార్హం. ఇతనెవరు అన్నంతనే కేటీఆర్ ఫోటోను చూసి బావ అని.. మరో ఫోటోలో హరీశ్ పేరు చెప్పటం కనిపిస్తుంది. చివరకు కేసీఆర్ ను చూపించినంతనే.. పండక్కి ఎక్కడైనా అల్లుళ్లను తెచ్చుకుంటారు కానీ..ఇలా మొగుడ్ని తెచ్చుకోవటం ఏమిటి? అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ మాట ఇ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.