Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి ఛాంబర్ కు తాళాలువేసిన సిబ్బంది.. కారణం ఇదేనట
By: Tupaki Desk | 12 Jun 2023 10:30 PM ISTఏపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో జీతాలు రావట్లేదన్న మాటతో పలు విభాగాల ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. జీతాలు వస్తున్న వారికి కూడా మొదటి వారంలో కాకుండా.. ఎప్పుడు జీతం చేతికి వస్తుందన్న విషయంపై అనిశ్చిత నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్రిష్ణకు సచివాలయ సిబ్బంది షాకిచ్చారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి ఛాంబర్ కు వారు తాళాలు వేశారు. గత ఏడాది నవంబరు నుంచి వేతనాలు రావటం లేదని.. సచివాలయంలోని ఆయన ఛాంబర్ కు తాళాలు వేసి నిరసన తెలిపారు.
దీంతో.. అవాక్కు అయితే మంత్రి పేషీ అధికారులు.. సచివాలయ అధికారులు తాళాలు తెరవాలని కోరుతూ..సిబ్బందిని కోరారు. అయితే.. తమకు జీతాలు ఇచ్చే వరకు తాళాలు తెరవమని తేల్చి చెప్పటంతో ఇప్పుడేం చేయాలి? అన్నది వారికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.