Begin typing your search above and press return to search.

ఏపీలో 15 చోట్ల హెల్త్ సిటీల ఏర్పాటు

By:  Tupaki Desk   |   22 Jun 2021 12:30 AM GMT
ఏపీలో 15 చోట్ల హెల్త్ సిటీల ఏర్పాటు
X
ఏపీ ప్రభుత్వం ప్రజల వైద్యఆరోగ్యం విషయంలో మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏపీలో హెల్త్ సిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఏపీలో ప్రజల వైద్య అవసరాలకు సరిపడా కార్పొరేట్ ఆస్పత్రులు లేవు. అందుకే అందరూ హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళుతున్నారు. పరాయి రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే సీఎం జగన్ ఈ కీలక హెల్త్ సిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో 15 చోట్ల హెల్త్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. హెల్త్ సిటీల కోసం స్థలాలను గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ .. తూర్పు గోదావరి, కృష్ణలో రెండు.. మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఒక్కో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నంలలో హెల్త్ సిటీలను నిర్మించాలని డిసైడ్ అయ్యింది.

తిరుపతి హెల్త్ సిటీ కోసం స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఒక్కో చోట 30 ఎకరాల్లో హెల్త్ సిటీలను నిర్మించాలని ప్రతిపాదించిన వైద్యారోగ్యశాఖ.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు భూములనూ కొనుగోలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మొత్తంగా ప్రైవేటు భూముల కొనుగోళ్లకు రూ.200 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనావేసింది.