Begin typing your search above and press return to search.
బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదు: ఈటెల సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 6 July 2023 5:38 PM GMTతెలంగాణలో బీజేపీపై కావాలనే కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాజాగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఆయనను ఆ పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో జూలైæ 8న ప్రధాని మోదీ సభ నేపథ్యంలో హనుమకొండకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉందని ఈటెల తెలిపారు. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందన్నారు. ఠక్కున పైకి వెళ్లి పడిపోవడానికి.. బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందని గుర్తు చేశారు.
చాప కింద నీరులా బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని ఈటెల వెల్లడించారు. కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనించాలని కోరారు. మాజీ ఆర్థిక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటో తనకు తెలుసునని అన్నారు. ఒంటరి మహిళల పెన్షన్లను నాలుగేళ్లుగా నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు, యూట్యూబ్ చానల్స్ బీజేపీ పని అయిపోయిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ గెలుపునకు వ్యూహ రచన చేయాలని నడ్డాకు మోదీ సూచించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలనకు అంతం పలికేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించిన ఊపును ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కొనసాగించామని ఈటెల తెలిపారు. మునుగోడులో సైతం నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని చెప్పారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంతం చేస్తుందని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి సారి ఓరుగల్లు గడ్డమీదకు వస్తున్నారన్నారు. పార్లమెంట్ కు ఎంపీని పంపించి బీజేపీని అక్కున చేర్చుకున్న గడ్డ వరంగల్ అని ఈటెల గుర్తు చేశారు. ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి ప్రధాని వరంగల్ కు వస్తున్నారని తెలిపారు.
2400 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు ప్రధాని మోదీ వచ్చాక రెట్టింపు అయ్యాయని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. శనివారం ఉదయం 9:30 గంటలకు ప్రధాని వరంగల్ కు చేరుకుంటారని.. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేస్తామన్నారు.