Begin typing your search above and press return to search.
అప్పుడేమో చివరి బంతి.. ఇప్పుడేమో ప్రజాజీవితంలో ఉండాలా? వద్దా?
By: Tupaki Desk | 11 Jun 2023 4:11 PM GMTకొందరికి కొన్ని ఇమేజ్ లు ఉంటాయి. వాటిని దెబ్బ తీసేలా చేసుకోవటం ద్వారా సాధించేదేమిటో అర్థం కాదు. అనూహ్యంగా అత్యున్నత పదవి దక్కటం ఒక ఎత్తు.. సమర్థంగా వ్యవహరించటం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ మాజీ ముఖ్యమంత్రి.. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎంగా పేరున్న కిరణ్ కుమార్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత సమర్థంగా నిర్వహించిన ప్రబుత్వాల్లో కిరణ్ సర్కారు మొదటి స్థానంలో ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణ తో పాటు.. అవినీతి తగ్గిపోవటం.. అప్పులు తీరటం లాంటివెన్నో జరిగాయి. కాకుంటే.. ప్రజాకర్షణకు దూరంగా ఉండటం.. తనకంటూ కోటరీని నిర్మించుకునే విషయంలో కిరణ్ చేసిన తప్పులు ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణకు అనుకూలంగా ఉన్న వేళలో.. ఆయన వ్యవహరించిన తీరు ఆయన ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బ తీసిందని చెప్పాలి.
తెలంగాణ సాధనకు నాటి కాంగ్రెస్ చీఫ్ సానుకూలంగా ఉన్న నేపథ్యాన్ని చూసుకొని.. అందుకు తగ్గట్లే వ్యవహరించి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా.. నాటి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మైలేజీ చిక్కుండా చేయాల్సింది. లేదంటే.. గులాబీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఉండాల్సింది. ఒకవేళ.. తాను నమ్మిన సమైక్యవాదాన్ని అమలు చేసేందుకు.. లోగుట్టుగా చేయాల్సిందంతా చేసేసి ఉన్నా విషయం మరోలా ఉండేది. అందుకు భిన్నంగా చివరి బంతి.. చివరి బంతి అద్భుతం అంటూ ఊరించి.. రెండింటికి చెడ్డ రేవడిలా మారారు.
సొంత పార్టీ పెట్టి.. నడపలేక చతికిలపడిన ఆయన.. ఆ తర్వాత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలా ఉన్నా ఆ గౌరవం అలానే కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు హటాత్తుగా బీజేపీలోకి రావటం.. కాషాయ కండువా వేసుకున్న ఆయన తీరును చూసినోళ్లంతా తిట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ను కష్టాల్లో ఉన్నవేళ.. విడిచి పెట్టేసి రావటమా? అన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. ఇంత చేసి.. బీజేపీలో చేరటం ద్వారా సాధించేదేమైనా ఉందా? అంటే జీరో అని చెప్పాలి. అలాంటప్పుడు పార్టీలో చేరి సాధించేదేమిటి? అన్నది ప్రశ్న.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజాజీవితంలో ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని ఇన్ని రోజులుగా ఆలోచించానని.. జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టమే జరుగుతుందన్నారు. ఈ మాటలన్ని కూడా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ద్వారా అనుభవించి.. ఇప్పుడు ప్లేట్ తిప్పేసి బీజేపీలో చేరిన వైనాన్ని తప్పు పడుతున్నారు. ఎందుకంటే.. తాను పార్టీ ఎందుకు మారాను? అన్న విషయంపై కిరణ్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవటం కూడా కారణంగా చెప్పాలి.