Begin typing your search above and press return to search.
వైసీపీ మాజీ ఎంపీ బీజేపీలోకి... కొత్త రాజకీయమేనా...?
By: Tupaki Desk | 28 Aug 2022 7:40 AM GMTవైసీపీ ద్వారానే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. ఏకంగా తన అధికారి పదవికి రాజీనామా చేసి మరీ పాలిటిక్స్ లోకి వచ్చాక తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయిపోయారు. ఆమె కొత్తపల్లి గీత. విశాఖ జిల్లా అరకు నుంచి 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ తరఫున పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే గీత చాలా తొందరలోనే వైసీపీ గూటి నుంచి బయటపడ్డారు.
అప్పట్లో ఆమె అధికారంలో ఉన్న టీడీపీకి మద్దతు ఇచ్చారు. జగన్ మీద నేరుగానే విమర్శలు చేశారు. వైసీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక ఆ పార్టీ పని ముగిసినట్లే అని ఆమె భావించారు. అందుకే ఆమె టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆమెను సైకిల్ పార్టీ పక్కన పెట్టిందని చెబుతారు. ఇక ఆనాడు పార్లమెంట్ లో బీజేపీకి ఆమె వైసీపీ ఎంపీగా ఉంటూనే మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులతో కలసిమెలసి తిరిగారు. దాంతో ఆమె బీజేపీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకున్నారు.
కానీ ఆమె బీజేపీలో చేరలేదు. ఇక ఆమె అప్పట్లో విజయవాడ వేదికగా జన జాగ్రుతి అనే సామాజిక సంస్థను కూడా ఆ మధ్యలో స్థాపించారు. కానీ తరువాత ఆ ఊసే లేదు. ఇపుడు ఆమె మళ్ళీ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ కి తాజాగా వచ్చిన బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆమె కలుసుకున్నారు. ఆయనతో ముచ్చటించారు. దాంతో ఆమె బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
విశాఖ బేస్ గా తన రాజకీయాన్ని మొదలెట్టిన గీత మళ్లీ అవకాశం ఇస్తే అరకు నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆమె బీజేపీని ఫస్ట్ బెస్ట్ చాయిస్ గా ఎంచుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక విశాఖ జిల్లా ఏజెన్సీలో బీజేపీకి గట్టి నాయకులు పెద్దగా ఎవరూ లేరు. పైగా ఎంపీ సీట్లు ఎక్కువగా కావాలనుకుంటున్న ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత కూడా ఉంది. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన గీతను పార్టీలోకి తీసుకుని పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
అయితే ఆమె పోటీ చేసేది విశాఖ ఏజెన్సీలో అడ్రస్ గా విశాఖను ఇస్తారు, కానీ ఉండేది ఎక్కువగా హైదరాబాద్ ఢిల్లీలలో అని వైసీపీలో ఉన్నపుడే విమర్శలు ఉన్నాయి. ఆమె ఎవరికీ అందుబాటులో ఉండరని కూడా టాక్ ఉంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి టికెట్లు తెచ్చుకున్న వారు తీరా గెలిచాకా జనాలకు కనిపించకపోతే ఆ పార్టీలకు కూడా చెడ్డ పేరు అని అంటున్నారు. మరి కొత్తపల్లి గీత కొత్త రాజకీయం ఈసారి అయినా రక్తి కడుతుందా ఆమెను బీజేపీ సమాదరిస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా కొత్తపల్లి గీత వైసీపీ గీత దాటి బయటకు వచ్చాక పొలిటికల్ గా నష్టపోయారనే అంటున్నారు.