Begin typing your search above and press return to search.
స్టీల్ ప్లాంట్ పై వేటుకు ఇంకా టైముంది
By: Tupaki Desk | 13 April 2023 1:30 PM GMTవిశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ అంటూ రెండేళ్ళుగా ఏపీ మొత్తాన్ని కలవరపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆగదు, అనివార్యం అంటూ అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు పెద్దలు సెలవిస్తున్నారు. బంగారం లాంటి ప్లాంట్, మూడు లక్షల కోట్ల ఆస్తిని ప్రైవేట్ పరం చేయడం ఏంటని ఎంత గగ్గోలు పెట్టినా కేంద్రం నుంచి మాత్రం తగిన జవాబు కానీ స్పందన కానీ ఉండడం లేదు
ఈ నేపధ్యంలో విశాఖ వచ్చిన ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద మీడియా అడిగిన దానికి ఆయన సందేహాస్పదమైన సమాధానాలే ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ని ఇప్పటికిపుడు ప్రైవేట్ పరం చేయబోవడం లేదని అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ లో కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేసే చర్యలు కూడా చేపడుతున్నామని అని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆహ్వానించే బిడ్ లో తెలంగాణా ప్రభుత్వం పాలు పంచుకోవడం ఒక ఎత్తుగడగా ఆయన కొట్టి పారేశారు. ప్లాంట్ సవ్యంగా నడిచేలా కార్మిక సంఘాలతో అటు యాజమాన్యంతో చర్చిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణ అన్నది ప్రసక్తే లేదు అని కేంద్ర మంత్రి చెబుతారు అనుకుంటే ఇప్పుడే కాదు అని మాత్రమే చెబుతున్నారు తప్ప లేదు అని స్పష్టంగా చెప్పకోవడం విశేషం. దీనిని బట్టి చూస్తే స్టీల్ ప్లాంట్ మెడ మీద ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది అనుకోవాల్సి ఉంటుంది.
స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు దానిని పటిష్టం చేస్తామని కేంద్ర మంత్రి చెబితే బాగుంటుంది అని అంతా అంటున్నారు. అయితే కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ విషయంలో దోబూచులే ఆడుతోంది. నాలుగు అడుగులు ముందుకు రెండడుగులు వెనక్కి వేస్తోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోందని, అయితే అది 2024కి ముందా తరువాత అన్నదే ఆలోచిస్తోంది అని అంటున్నారు.