Begin typing your search above and press return to search.

చారానా కోడికి బారానా మసాలా.. స్కూటీ నెంబరు కోసం కోటి ఖర్చు

By:  Tupaki Desk   |   17 Feb 2023 11:11 AM GMT
చారానా కోడికి బారానా మసాలా.. స్కూటీ నెంబరు కోసం కోటి ఖర్చు
X
చారానా కోడికి బారానా మసాలా అన్న సామెత తరచూ చెబుతుంటాం. బుర్ర.. బుద్ధి ఉన్నోడు అలా చేస్తాడా? అనుకుంటాం. కానీ.. కొన్ని సందర్భాల్లో కొందరు చేస్తుంటారు. అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

అందరిని తెగ ఆకర్షిస్తున్న ఈ ఉదంతం సోషల్ మీడియాలోనే కాదు.. ప్రధాన మీడియాలోనూ వార్తాంశంగా మారింది. చారానా కోడికి బారానా మసాలా భారీఎత్తున ఖర్చు పెట్టేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో ఒక వాహన రిజిస్ట్రేషన్ కోసం ఫ్యాన్సీ నెంబరు బిడ్ జరిగింది. అందులో ఒక నెంబరు కోసం ఏకంగా రూ.కోటికి పైనే కోట్ చేశారు. నెంబరు కోసం ఇంత భారీ ఖర్చుకు రెఢీ అయ్యారు.. అసలేం వెహికిల్ అని చెక్ చేసినోళ్లందరి నోట మాట రాని పరిస్థితి. ఎందుకంటే.. అది కేవలం ఒక స్కూటీ కోసం ఇంత భారీ ఖర్చుకు రెఢీ కావటం షాకింగ్ గా మారింది.

సిమ్లాలో హెచ్ పీ 999999 నెంబరు కోసం బిడ్ ఓపెన్ చేశారు. ఈ నెంబరు కోసం వేలంలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిగిలిన వారికి భిన్నంగా కోట్ ఖాయ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి.. ఈ నెంబరు కోసం రూ.1,00,11,000 కోట్ చేశాడు. ఈ నెంబరు కోసం మొత్తం 22 మంది బిడ్ వేశారు. వారిలో రూ.కోటికి పైనే బిడ్ చేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.

దీంతో.. ఇంత భారీ మొత్తానికి బిడ్ వేశాడు.. ఇంతకూ అదేం వాహనం అని చూసినోళ్లు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇంతకూ ఆ వాహనం ఏమంటే.. స్కూటీ.
అయితే.. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్సీ నెంబరు బిడ్ లో పాల్గొనేందుకు ఎవరైనా సరే రూ.వెయ్యి మొత్తాన్ని రిజర్వు ధరగా ఉంది.

దీంతో.. తమకు తోచిన మొత్తాన్ని బిడ్ గా పేర్కొనొచ్చు. నెంబరు అలాట్ చేసిన తర్వాత దాన్ని కట్టలేకపోతే.. దాని బిడ్ లో సదరు వ్యక్తి తర్వాతి వారికి కేటాయిస్తారు. దీంతో.. ప్రచారం కోసం ఇంత భారీగా కోట్ చేసి వార్తల్లోకి వచ్చే ఎత్తుగడగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఆ వాదనలో నిజం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అధికారులు నెంబరు కేటాయించిన తర్వాత ఆ భారీ మొత్తాన్ని చెల్లిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరో రోజులో ఈ విషయంపై క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.