Begin typing your search above and press return to search.

స్టాలిన్ కిడ్నాప్ ప్ర‌చారాన్ని ఖండించిన న‌టి

By:  Tupaki Desk   |   27 April 2018 1:30 PM IST
స్టాలిన్ కిడ్నాప్ ప్ర‌చారాన్ని ఖండించిన న‌టి
X
డీఎంకేకు అధినేత‌గా క‌రుణ‌ను చెప్పుకున్నా.. ఆయ‌న‌కు రాజ‌కీయ వార‌సుడు.. ఆ పార్టీని మొత్తంగా న‌డిపించేది స్టాలినే. అయితే.. ఆయ‌నపై ప‌లు ప్ర‌చారాలు జోరుగా సాగుతుంటాయి. అన్నింటికి మించిన ఆయ‌న ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసేలా ఒక న‌టిని గ‌తంలో ఆయ‌న కిడ్నాప్ చేశారంటూ ప్ర‌చారం సాగుతోంది.

ఇది కొన్నేళ్లుగా జ‌రుగుతున్న‌దే. అయితే.. ఆ వదంతిలో ఎలాంటి నిజం లేద‌ని.. ఒక పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడి హోదాలో ఉన్న వ్య‌క్తి మీద అలాంటి ప్ర‌చారం స‌రికాద‌ని ఖండిస్తున్నారు దూర‌ద‌ర్శ‌న్ లో ఒక వెలుగు వెలిగిన న్యూస్ రీడ‌ర్ ఫాతిమాబాబు.

కొన్నేళ్ల క్రితం స్టాలిన్ ఆమెను అప‌హ‌రించిన‌ట్లుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. గ‌తంలో త‌న‌ను ఇదే ప్రశ్న అడిగార‌ని.. అప్ప‌ట్లోనే తాను ఖండించినా ప‌త్రిక‌ల్లో మాత్రం రాలేద‌న్నారు. తాను దూర‌ద‌ర్శ‌న్ లో న్యూస్ రీడ‌ర్ గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలోనే చిత్తిర‌పావై అనే సీరియ‌ల్ లో త‌న‌కు న‌టిగా అవ‌కాశం వ‌చ్చింద‌ని... దూర‌ద‌ర్శ‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆ సీరియ‌ల్ లో న‌టించటం పూర్తి అయ్యే వ‌ర‌కూ వార్త‌లు చ‌ద‌వ‌కూడ‌ద‌ని చెప్పార‌న్నారు.

ఈ కార‌ణంతోనే ఆ సీరియ‌ల్ కోసం 13 వారాల పాటు వార్త‌లు చ‌ద‌వ‌టానికి దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇదే సంద‌ర్భంలో త‌న‌ను స్టాలిన్ కిడ్నాప్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయ‌న్నారు. ఒక పార్టీలో కీల‌క ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి మీద ఈ త‌ర‌హా వార్త‌లు రావ‌టం స‌రికాద‌న్నారు. ఇదే విష‌యం మీద ఒక ప్ర‌ముఖ వార‌ప‌త్రిక విలేక‌రికి తాను వివ‌ర‌ణ ఇచ్చాన‌ని కానీ ఆ వివ‌రాలేవీ రాలేద‌న్నారు.

పెళ్లికి ముందు.. త‌ర్వాత కూడా త‌న భ‌ర్త బాబు త‌న‌ను టీవీ ఛాన‌ల్ ఆఫీసు నుంచి ఇంటికి తీసుకెళ్లి తీసుకొచ్చేవార‌న్నారు. తాను ఇక‌పై ఆ వ‌దంతిపై వివ‌ర‌ణ ఇవ్వ‌న‌న్న ఆమె.. తాజాగా అన్నాడీఎంకే నుంచి దూరంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి త‌ర్వాత కాలంలో సీరియ‌ల్స్ లో న‌టించిన ఆమె.. సినిమాల్లోనూ న‌టించి మంచి పేరును సంపాదించారు. అదే స‌మ‌యంలో స్టాలిన్ త‌న‌ను అప‌హ‌రించార‌న్న వదంతిని ఆమె కొన్ని ద‌శాబ్దాలుగా మోస్తున్నారు. తాజాగా ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వటం ఆస‌క్తిక‌రంగా మారింది.