Begin typing your search above and press return to search.
ఫ్లాష్: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుళ్లు
By: Tupaki Desk | 21 Aug 2020 4:30 AM GMTశ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి.
4వ యూనిట్ లో కార్మికులు విద్యుదుత్పత్తి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్టు సమాచారం. ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగడంతో వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్ధాలు వెలువడినట్లు స్థానికులు తెలిపారు.
రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్ నుంచి సర్వీస్ బేస్ వరకు దట్టమైన పొగ కమ్ముకుపోయింది. ఆ సమయంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలిసింది. వారంతా వెంటనే బయటకు పరులు తీశారు. ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు.
కాగా దట్టమైన పొగలు, మంటల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. విషయం తెలిసిన వెంటనే మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.