Begin typing your search above and press return to search.
రైల్వే స్టేషన్ లో ప్లాష్ మ్యాబ్ వెనుక అసలు విషయం తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 27 May 2022 10:30 AM GMTభారత రైల్వేల మీద ఉన్నన్ని జోకులు అన్ని ఇన్ని కావు. గతంతో పోలిస్తే.. గడిచిన కొన్నేళ్లుగా రైల్వేల తీరులో మార్పు వచ్చింది. ఆ మాటకు వస్తే ఆ మార్పు మన్మోహన్ సర్కారు నుంచే మొదలైందని చెప్పాలి. గతంలో ఏ ట్రైన్ ఎంత ఆలస్యంగా వస్తుందో అంచనా కూడా వేయలేని పరిస్థితి. ఏ రైలు అయినా రైట్ టైంకు రావటం ఒక వింతగా ఉండేది. అంత లేటుగా రైళ్లు నడిచే పరిస్థితి నుంచి ఇప్పుడు కాస్త అటు ఇటుగా వచ్చే పరిస్థితి. అయితే.. ఏ ట్రైన్ అయినా తాను చేరాల్సిన స్టేషన్ కు అయితే ఆలస్యం లేదంటే టైముకు మాత్రమే జరుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా మధ్యప్రదేశ్ లోని ఒక స్టేషన్ కు తాను రావాల్సిన దాని కంటే దాదాపు ఇరవై నిమిషాల ముందు వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం సదరు స్టేషన్ లో ట్రైన్ పది నిమిషాలు ఆగాలి. రావాల్సిన దాని కంటే 20 నిమిషాల పాటు ముందు రైలు వచ్చేసరికి.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు.. ఎంచక్కా ఆ టైంలో స్టేషన్ ప్లాట్ ఫాం మీద ప్లాష్ మ్యాబ్ ను తమకు తోచిన రీతిలో చేసిన వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని రత్లాం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ రైలు వివరాల్లోకి వెళితే.. బాంద్రా నుంచి హరిద్వార్ కు వెల్లాల్సిన రైలు షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 10.35 గంటలకు స్టేషన్ కు రావాల్సి ఉంది.

అయితే.. ఈ రైలు షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందు అంటే.. 10.15 గంటలకే చేరుకుంది. దీంతో.. ఆ స్టేషన్ లో ట్రైన్ అరగంట ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో.. కొందరుప్రయాణికులు సరదాగా స్టేషన్ ప్లాట్ ఫాం మీదకు వచ్చి సరదాగా డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను పలువురు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి.. హ్యాపీ జర్నీ అని రాసుకొచ్చారు. భారత రైల్వేలు సమయానికి రావటమే ఎక్కువనే చాలామంది.. ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇది హ్యాపీ జర్నీనే.