Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్ జాబితా .. అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భారత మహిళలు

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:02 AM GMT
ఫోర్బ్స్ జాబితా .. అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భారత మహిళలు
X
ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకు స్థానం లభించింది. మొత్తం 100 మంది పేర్లతో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు నిలిచారు. ఆపై రెండో స్థానంలో యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే నిలిచారు.

ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా, హెచ్‌ సీఎల్‌ సీఈఓ రోష్నీ నాడార్‌ మల్హోత్రాలు కూడా ఈ ప్రతిష్ఠాత్మక జాబితాకు ఎంపికయ్యారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారి్‌సకూ ఇందులో చోటు లభించింది. ఇక ఐరోపా కేంద్ర బ్యాంకు చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 10 దేశాలకు చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, 38 కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు, ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో ఉన్న ఐదుగురు మహిళలను ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతులుగా పేర్కొంది.

2020లో ప్రపంచవ్యాప్తంగా పలువురు మహిళలు పలు రంగాల్లో ఉన్నతస్థానాలను అధిష్టించారు. ఇందులో ప్రభుత్వంలో నాయకత్వం, పారిశ్రామికరంగం, దాతృత్వం, మీడియా రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచారని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు జాబితాలో చోటు దక్కడం. దేశ తొలి ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కీలకమైన రక్షణశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. నిర్మలా సీతారామన్‌ కంటే ముందుగా ఆర్థికశాఖను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టారు.