Begin typing your search above and press return to search.

తనకు అక్రమ సంబంధాలున్నాయన్న మాజీ క్రికెటర్!

By:  Tupaki Desk   |   19 July 2019 1:30 AM GMT
తనకు అక్రమ సంబంధాలున్నాయన్న మాజీ క్రికెటర్!
X
ఒకప్పటి పాకిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద కామెంట్లు చేశాడు. తనకు బోలెడంత మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని అతడు చెప్పుకొచ్చాడు. అది కూడా తనకు పెళ్లైన కొత్తలోనే పలువురు మహిళలతో సంబంధాలు ఉండేవని అతడు వివరించాడు.

ఒక పాకిస్తాన్ టీవీ చానల్ లో తన రాసలీలల గురించి అతడు చెప్పుకొచ్చాడు. వివాహం చేసుకున్నాకా పలువురు మహిళలతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసినా తనకు తప్పుగా ఏమీ అనిపించలేదని రజాక్ చెప్పుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. రజాక్ ను ఇన్నాళ్లూ తాము ఒక ఆటగాడిగా గౌరవించినట్టుగా.. ఇక నుంచి ఆ గౌరవం ఉండదన్నట్టుగా వారు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రజాక్ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది. ప్రపంచకప్ సందర్భంగా పలుసార్లు వివాదాస్పదంగా మాట్లాడాడు.

భారత బౌలర్ షమీ గురించి ప్రస్తావిస్తూ.. అతడు ముస్లిం కావడం తనకు ఆనందంగా ఉందని రజాక్ చెప్పుకొచ్చాడు. అతడు బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అందులోనూ ముస్లిం కావడం ఆనందమంటూ ఒత్తి చెప్పాడు రజాక్. దాదాపుగా అందరూ తనను అందరూ మరిచిపోతున్న నేపథ్యంలో రజాక్ ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తున్నట్టున్నాడు!