Begin typing your search above and press return to search.
భార్యపై దాడి చేసిన మాజీ క్రికెటర్.. కేసు నమోదు..!
By: Tupaki Desk | 5 Feb 2023 1:06 PM GMTక్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కాలంలో అతడితో పాటు ఆడిన ప్రముఖ ఆటగాళ్లలో వినోద్ కాంబ్లీ ఒకరు. సచిన్ తో కలిసి ఆడే క్రమంలోనే ఆటలో ఎన్నో మెళకువలు నేర్చుకుంటూ నాటి టీం ఇండియా జట్టులో ప్రధాన ప్లేయర్ గా ఎదిగాడు. ఈ క్రమంలో జట్టుకు అవసరమైన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆట కంటే కూడా కుంబ్లే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలువడం గమనార్హం.
1991లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్న కాంబ్లీ 17 టెస్టులు.. 104 వన్డేలు ఆడాడు. తన చివరి మ్యాచ్ ను కాంబ్లీ అక్టోబర్ 2000 లోనే ఆడాడు. వివాదాస్పద ప్రవర్తన కాలంలో కాంబ్లీ ఎక్కువగా క్రికెట్ ను కొనసాగించలేకపోయాడు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ అనేక వివాదాలతో కాంబ్లీ గతంలోనూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో ఓ వ్యక్తికి చెందిన కారును ఢీకొట్టాడు దీంతో కాంబ్లీపై సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో కాంబ్లీ గతంలోనే అరెస్టు కాగా అదేరోజు బెయిల్ పై విడుదల అయ్యాడు. ఈ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఈసారి కుంబ్లే భార్యనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మద్యం మత్తులో కుంబ్లే తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది.
వినోద్ కాంబ్లీ బాంద్రాలోని తన నివాసంలో మద్యం మత్తులో తన భార్యపైకి పాన్ హ్యాండిల్ ను విసిరాడని.. దీంతో తన తలకు పెద్ద గాయమైందని అతని భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదుతో ముంబై పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ కేసులో అరెస్టయి బెయిల్ పై వచ్చిన కుంబ్లే ఇప్పుడు సొంత భార్యను కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు.
దీంతో ముంబై పోలీసులు కాంబ్లేకు కౌన్సిలింగ్ నిర్వహించి పంపించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తన వివాదాస్పద వ్యక్తిత్వం కారణంగా కుంబ్లే అటూ కెరీర్ పరంగా.. ఇటు వ్యక్తిగతంగానూ చాలా నష్ట పోతున్నాడనే కామెంట్స్ అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరీ కుంబ్లే ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని లేకుంటే భవిష్యత్తులో మరిన్ని కేసులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.