Begin typing your search above and press return to search.

ఆన్​ లైన్​ గేమ్​.. ఈ ఊబిలోకి దిగామంటే బయటకు రాలేము..!

By:  Tupaki Desk   |   17 Nov 2020 11:30 PM GMT
ఆన్​ లైన్​ గేమ్​.. ఈ ఊబిలోకి దిగామంటే బయటకు రాలేము..!
X
ఆన్​లైన్​ గేమ్స్​ ఇప్పుడు ప్రజలను డబ్బును గుల్లచేస్తున్నది. కష్టపడి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించే యువత ఈజీమనీ కోసం ఈ ఆన్​లైన్​ గేమ్స్​లో డబ్బులు తగలేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్​లైన్​ గేమ్స్​ ను నిర్వహించే సంస్థలు ప్రజల బలహీనతల మీద దెబ్బకొట్టి కోట్లు కొల్లగొడుతున్నది. సెలబ్రిటీలు కూడా వీటికి ప్రమోషన్లు ఇస్తుండటంతో యువత పెద్ద ఎత్తున బానిసలవుతున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో సైతం ఆన్​ లైన్​ గేమ్స్​ ఆడే వారిసంఖ్య లక్షల్లో పెరిగి పోయింది. ఈ లాక్ డౌన్​ సమయంలో అత్యధికంగా ఈ ఆన్​లైన్​ గేమ్స్​ ను ప్రజలు డౌన్​ లోడ్​ చేసుకున్నట్టు సమాచారం. ఈజీగా డబ్బు సంపాదించొచ్చన్న ఉద్దేశ్యం తో ప్రజలు వీటికి బానిసలవుతున్నారు. టీనేజ్​ పిల్లలతో పాటు, ఉద్యోగస్థులు, గృహిణులు కూడా ఈ గేమ్​ కు అడిక్ట్​ పోయితున్నారు. ఆన్​ లైన్​ గేమ్​ నిర్వాహకులు ప్రజలకు అప్పులు ఇచ్చి ఈ రొంపిలోకి లాగుతున్నాయి. తమ అవసరాల కోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తూ వాటిని కట్టలేక ఎందరో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

ఏపీలో ఈ ఆన్​లైన్​ గేమ్స్​ను అక్కడి ప్రభుత్వం నిషేధించినప్పటికి.. గత రెండు నెలల్లోనే ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. మొదట్లో మనకు డబ్బులు వచ్చిటట్టు చేసి.. ఆ తర్వాత మన పనిపట్టడం వీటి ప్రత్యేకత. మనం ఆడుతున్నది ఎవరితోనే తెలియదు. అసలు అక్కడ ఓ మనిషి ఉంటాడో మిషన్​ ఉంటుందో కూడా తెలియదు. ప్రారంభంలో అంతా పారదర్శకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత అసలు ఆట మొదలవుతుంది. వందలు, వేలు పోయి మనం లక్షల్లో అందుల్లో పెట్టామంటే మన డబ్బులు పోయినట్టే. చేతి లో స్మార్ట్​ ఫోన్​, దానికి ఇంటర్నెట్​ ఉంటే చాలు రోజుకు వేలల్లో డబ్బులు సంపాదించవొచ్చంటూ ఈ దందా ను కొందరు సోషల్ ​మీడియా లో ప్రచారం చేస్తుంటారు.

ఖాళీ గా ఉన్న వారు, ఉద్యోగాలు చేసేవాళ్లు, గృహిణులు ఇటువంటి ప్రకటనలకు ఆకర్షితులై ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. రీసెంట్​ గా ఓ గృహుణి తన వద్ద ఉన్న 25 తులాల బంగారాన్ని ఆన్​ లైన్​ గేమ్​ లో పెట్టి తీవ్రం గా నష్ట పోయింది. ఇటువంటి మహిళలు దేశ వ్యాప్తంగా కోకొల్లలు గా ఉన్నారు. ఈ ఆన్ ​లైన్​ గేమింగ్​ సంస్థలు వినియోగదారులకు అప్పులు కూడా ఇస్తున్నాయి. ఎటువంటి ష్యూరిటీ లేకుండా అప్పులు ఇస్తుండటం తో యువత పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని వాటిని తిరిగి చెల్లించ లేక ఆత్మ హత్య చేసుకుంటున్నారు.

విశాఖపట్నంలో నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీశ్ ఆన్​లైన్​ పేకాటకు బానిసై అప్పులు పెరిగి నవంబర్ 15న రైలు పట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ పేకాటలో సతీశ్​ 25 లక్షల రూపాయల పోగొట్టుకున్నట్టు సమాచారం.
సతీశ్​కు భార్య ప్రత్యూష (28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. రెండు వారాల క్రితం విశాఖపట్నానికే చెందిన ఆహ్లాద అనే యువతి ఆత్మహత్య చేసుకున్నారు.

ఎంబీఏ చదివి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఆహ్లాద ఇంటి అవసరాల కోసం తల్లిదండ్రులకు తెలియకుండా వివిధ మనీ లెండింగ్ యాప్స్‌లో 40 వేల రూపాయల వరకూ అప్పు తీసుకున్నారు. గడువు తేదీ దాటిపోయినా వాటిని తీర్చలేకపోయారు. దీంతో ఆయా యాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఆమెకు ఒత్తిడి మొదలైంది. వీటిని తాళలేక ఆహ్లాద ఆత్మహత్య (నవంబర్ 3, 2020) చేసుకున్నారు. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఆన్​లైన్​ గేమ్​లను నిషేధించి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.