Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలని లేదు.. తేల్చేసిన కీలక నేత
By: Tupaki Desk | 9 Oct 2022 7:45 AM GMTసీనియర్ రాజకీయ నేత.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాజధాని అమరావతిగా నిర్ణయించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అమరావతి కోసం ఉద్యమించిన రైతులు.. రైతులు కాదని పెయిడ్ ఆర్టిస్టులని.. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిగా పేర్కొంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడటం తెలిసిందే. అయితే.. రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న వారంతా రైతులే అని లేని పక్షంలో ఈపాటికి మరిన్ని సమస్యలు ఎదురై ఉండేవంటున్నారు.
రాజధాని కోసం ఉత్తరాంధ్ర ప్రజలు తపిస్తున్నారన్న వాదనను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. అవసరమైతే ఉద్యమం చేస్తామనే నేతలు లేకపోలేదు. వాస్తవాన్ని వాస్తవంగా చూసినప్పుడు.. నిజంగానే విశాఖను రాజధానిగా బలంగా కోరుకుంటే ఈపాటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించినట్లుగా.. రాజధాని కోసం ఉద్యమించేవారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నారంటే విశాఖ ప్రజలు స్పందించారని.. రాజధాని కోసం ఎవరూ స్పందించటం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర ప్రజలే కాదు.. వైసీపీ వారు సైతం విశాఖను రాజధానిగా కోరుకోవటం లేదన్నారు. ''విశాఖకు రాజధాని కావాలని మూడేళ్లుగా రాజీనామాలు చేయని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడే చేస్తామని ఎందుకు అంటున్నారు? వాళ్లంతట వాళ్లు రాజీనామాలు చేస్తామని అనటం లేదు. ముఖ్యమంత్రి జగన్ వాళ్లతో చేయిస్తామని చెప్పిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడని వారు మూడు రాజధానుల గురించి రాజీనామా చేస్తున్నారంటే ఎవరూ నమ్మరు'' అని వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా మీద కట్టుబడి ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాజధానికే కట్టుబడి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గొప్ప సంస్కరణవాదిగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టిన ఆయన జాతీయ పార్టీ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. అంతేకాదు.. కేసీఆర్ లాంటి సంకుచిత భావాలున్న అధినేత రాణించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా లేవన్నారు. పలు అంశాల మీద హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.