Begin typing your search above and press return to search.
యువత కోసం హైదరాబాద్ లో సరికొత్త ప్రయోగం..
By: Tupaki Desk | 13 Oct 2022 1:33 PM GMTవిశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ లో సౌకర్యాలు పెరుగుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలు మెరుగైన వసతులు కల్పించేందుకు రెడీ అవుతున్నాయి. యువత శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ తెలిపారు.
ఇంతకుముందు ప్రయోగాత్మకంగా ఆయా జోన్ల పరిధిలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ఆసక్తి కనబరచడంతో నగర వ్యాప్తంగా ప్రజల కోసం హైదరాబాద్ లో అనువైన చోట్ల 90 కి.మీల మేర శాశ్వత, తాత్కాలిక సైకిల్ ట్రాక్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు.
హైదరాబాద్ లో 709 కిలోమీటర్ల నాలుగు లైన్లు అంతకంటే ఎక్కువ వెడల్పు గల రోడ్డు అందుబాటులో ఉంది. సీఆర్ఎంపీ ద్వారా రోడ్లను చేపట్టి అందరికీ మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు. ఆ రోడ్లలో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి ప్రస్తుత బిజీ ప్రపంచంలో శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక ధృఢత్వం పెరిగే విధంగా నగర ప్రజలకు మెరుగైన సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటుకు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
సైకిల్ ఔత్సాహికుల ఆసక్తికి అనుగుణంగా కొన్ని ప్రదేశాల్లో తాత్కాలికంగా మరికొన్ని ప్రాంతాల్లో శాశ్వతంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు మేయర్ తెలిపారు. నగరంలో జోన్లలో సుమారు 90 కి.మీ పొడువులో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్టు నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఎల్.బీ నగర్ జోన్ లోని హబ్సిగూడా రోడ్డు నుంచి ఉప్పల్ చౌరస్తా వరకూ 3 కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్ పర్మనెంట్ గా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బైరామల్గూడ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ వరకూ 4 కి.మీల పర్మనెంట్ గా.. చార్మినార్ జోన్ లో ఓవైసీ జంక్షన్ నుంచి ఆరంఘార్ వరకూ శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఆరంఘార్ నుంచి పీడీపీ జంక్షన్ వరకు 4 కి.మీ శాశ్వత ట్రాక్ , ఖైరతాబాద్ జోన్ లో కేబీఆర్ అరౌండ్ పార్క్ 6 కి.మీలు, ఓయూ కాలనీ జంక్షన్ సెనార్ వ్యాలీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, శేరిలింగం పల్లి, దుర్గం చెరువు, ఐకియా టు బయో వర్సిటీ, ఖాజా దుర్గ జంక్షన్ టు కేర్ హాస్పిటల్, లింక్ రోడ్డు టు ఖాజా గూడ రోడ్డు, కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు నుంచి జేఎన్టీయూ రెయిన్ బో విస్ట నుంచి ఐడీఎల్ చెరువు వరకూ ఇలా సైక్లింగ్ ట్రాక్ ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోనూ సైక్లింగ్ ట్రాక్ రోడ్లను మరిన్ని ఏర్పాటుకు నిర్ణయించారు. తాత్కాలికంగా సైక్లింగ్ ట్రాక్ ను ఉదయం 8 గంటల వరకూ నిర్వహించిన తర్వాత ఆ రోడ్డును ట్రాఫిక్ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది.