Begin typing your search above and press return to search.
మొత్తానికి గెలిచిన గాలి జనార్ధనరెడ్డి
By: Tupaki Desk | 13 May 2023 2:35 PM GMTబీజపీని వీడిన నేత, మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి మొత్తానికి ఈ ఎన్నికల్లో గెలిచారు. కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీతో ఆయన గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. గాలి తనతో పాటు నిలబెట్టిన మరో నలభై నాలుగు మంది అభ్యర్ధులు ఓడిపోయారు. అంతే కాదు, గాలి సతీమణి లక్ష్మీ అరుణ కూడా ఓటమి పాలు కావడం విశేషం.
తాను ఒక్కడు మాత్రమే గెలిచినా గాలి బీజేపీని చాలా సీట్లలో ఓడించేసారు. బళ్లారీ సెగ్మెంట్ లో ఎపుడూ బీజేపీకి ఆధిక్యత ఉంటుంది. అలాంటి చోట గాలి ఓట్లు చీల్చి బీజేపీకి భారీ దెబ్బేశారు. ఇదంతా ఆయన కమలం పార్టీ మీద కోపంతో చేసిన పనిగానే చూస్తున్నారు. గాలి అలా బీజేపీకి ఎదురుగాలిగా మారడంతో కాంగ్రెస్ కి అనుకూల గాలిగా మారింది.
ఒకనాడు అయితే బీజేపీలో ఒకపుడు గాలి జనార్ధనరెడ్డి హవా నడిచేది. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే బళ్లారీ ప్రాంతంలో గాలి గట్టి నేతగా ఉంటూ బీజేపీలో చేరి కొన్నాళ్ళు చక్రం తిప్పారు. ఆయనను బీజేపీ నుంచి బయటకు పంపించేశాక సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు.
దానికి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అన్న పేరుని కూడా పెట్టారు. ఆ పార్టీ తరఫున తాను తన భార్యతో పాటు మొత్తం నలభై అయిదు సీట్లలో పోటీ పెట్టారు. చెప్పాలీ అంటే అసెంబ్లీ టోటల్ సీట్లలో అయిదవ వంతులో పోటీకి పెట్టారన్న మాట. ఇది ఒక విధంగా బీజేపీకి దెబ్బగానూ కాంగ్రెస్ కి వరంగానూ మారింది.
గాలి పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. అదే టైం లో బీజేపీని ఓడించేశారు. బళ్లారీ పరిసర ప్రాంతాలలో పట్టు ఉన్న బీజేపీకి గాలి పెద్ద ఎత్తున నష్టమే చేకూర్చారు అని అంటున్నారు. గాలి మహిమతో ఒకే ఒక్క సీటు గంగావతిలో తప్ప ఆ పార్టీకి ఎక్కడా అంచులూ ఆనవాళ్ళూ లేకుండా పోయాయని చెప్పకతప్పదు.
అంతే కాదు తనకు ఒకనాడు అతి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ మంత్రి శీరాములు సైతం బళ్లారీ రూరల్ నుంచి ఈసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా గాలి దెబ్బ ఏంటో తన సనచరులకు బీజేపీకి కూడా చూపించారు. అయితే చిత్రంగా గాలి పార్టీని జనాలు ఏ మాత్రం ఆదరించలేదు. ఆయనది గెలిచే పార్టీగా కాకుండా చీల్చే పార్టీగానే అంతా చూసారు. దాంతో జస్ట్ రెండు వేల ఓట్ల తేడాతోనే గాలికి విజయం దక్కిందంతే.
ఇదిలా ఉంటే తన పార్టీకి కనీసంగా పది నుంచి పదిహేను సీట్లు వస్తాయని గాలి అంచనాలు వేసుకున్నారు. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, తాను కింగ్ మేకర్ గా చక్రం తిప్పవచ్చని కలలు కన్నారు. కానీ ఇపుడి ఏకైక ఎమ్మెల్యేగానే ఆయన మిగిలారు.