Begin typing your search above and press return to search.
జూనియర్ గాంధీలు... మోడీతో ఢీ ?
By: Tupaki Desk | 24 Dec 2021 2:30 AM GMTనెహ్రూ గాంధీల ప్రస్తక్తి లేకుండా గత కాలం అయినా ఆధునిక రాజకీయం అయినా అడుగు ముందుకు కదలదు, వారసత్వం అని ఎంత అనుకున్నా ఈ రోజుకీ కాంగ్రెస్ పార్టీ అలా బతికి బట్ట కట్టి ఉందంటే గాంధీల వారసులు పగ్గాలు పట్టుకుని కూర్చున్నారు కాబట్టి. ఇక కాంగ్రెస్ కి ఏ నాయకుడు చేయలేనంతగా ఏకంగా పాతికేళ్ళ నుంచి సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యలో కేవలం ఆరు నెలల పాటు మాత్రమే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అనిపించుకున్నారు.
సరే రాహుల్ కాడె వదిలేసినా ఆయన మాటే కాంగ్రెస్ లో చలామణీ అవుతుంది. ఇక ప్రియాంకా గాంధీ కూడా మరో వైపు శాసిస్తున్నారు. మొత్తానికి ఆ ముగ్గురి చేతుల్లోనే మొత్తం కాంగ్రెస్ ఉంది. దాని భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే అప్పట్లో సోనియాగాంధీతో గిట్టక వేరు పడిపోయిన తోడికోడలు మేనకా గాంధీ దశాబ్దాలుగా విపక్ష పార్టీలలోనే ఎదిగారు.
ఆమె తొలుత సంజయ్ విచార్ మంచ్ ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత దాన్ని జనతాదళ్ లో విలీనం చేసి వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ మీదట అనేక విపక్ష కూటముల్లో మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి వాజ్ పేయి ప్రధాని అయ్యాక అందులో కూడా చేరి మంత్రిగా హవా చలాయించారు. ఇంతలో కొడుకు వరుణ్ గాంధీ ఎదిగి రావడంతో ఆయన్ని ముందు పెట్టారు. ఆమె కూడా లోక్ సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
ఇక గత ఎన్నికలలో వరుణ్ గాంధీ యూపీలో తన తల్లి మేనకాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పిలిభిట్ నుంచి ఎంపీగా గెలిచారు. వస్తున్నారు. ఆయన ఆ మధ్య దాకా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉండేవారు. ఇక యూపీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావాలనుకున్న వారిలో ఆయన కూడా ఒకరు. కానీ ఆ చాన్స్ బీజేపీ హై కమాండ్ ఇవ్వలేదు.
మరో వైపు చూస్తే గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మేనకా గాంధీకి కానీ వరుణ్ గాంధీకి కానీ మోడీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దాంతో ఆయన విసిగిపోయారు అనే చెప్పాలి. ఇంకో వైపు పార్టీలో కూడా ఇపుడు కీలక పదవులు లేవు దాంతో ఆయన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలను గట్టి మద్దతు ఇచ్చి ఏకంగా మోడీ సర్కార్ ని ఇరుకున పెట్టారు. అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీయే ఇలా రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అంటే కమలానికి కలవరమే కదా.
అయినా వరుణ్ గాంధీ టైమ్ చూసి తన పవర్ చూపించారు. దాంతో బీజేపీలో ఇపుడు ఆయన ఒంటరి అయ్యారు. అయినా సరే తాను వెనక్కి తగ్గనని ఈ యువ ఎంపీ అంటున్నారు. ఇక ఆయన మరో మాట కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయినా బేఫికర్ అనేస్తున్నాడు. మంచిని మంచిగా చూడాలి. చెడ్డని ఎవరో ఒకరు చెప్పాలి. ప్రజల సమస్యల మీద సైలెంట్ గా ఉండడం తనకు చేతకాదని వరుణ్ గాంధీ చెబుతున్నారు.
తన తల్లి మేనకాగాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సంగతిని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందువల్ల తాను కూడా అలగే అన్న సంకేతాలు పంపుతున్నారు. మొత్తానికి ఈ జూనియర్ గాంధీ మోడీకే సవాల్ చేస్తున్నారు. ఒక విధంగా బీజేపీ మోడీ అమిత్ షా చేతుల్లోకి వెళ్లాక ఇంతలా ఎదిరించి నిలబడిన ఎంపీ మరొకరు లేరు. కానీ వరుణ్ గాంధీ ఎక్కడా తగ్గనని అంటున్నారు.
దాంతో ఆయనని బీజేపీ వదిలేసింది. అయితే యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఆయన చరిష్మాకూదా ఎంతో కొంత ఉపయోగపడుతుంది, కానీ బీజేపీ మాత్రం ఈ గాంధీని వదులుకోవడానికే సిద్ధపడుతున్నట్లుగా ఉంది. మరో వైపు చూస్తే వరుణ్ అన్న రాహుల్ గాంధీ అయితే మోడీని గట్టిగానే ఢీ కొంటున్నాడు. ఆయన పార్టీయే మోడీకి ప్రత్యామ్యాయం. రేపటి ప్రభుత్వానికి కాబోయే ప్రధానిగా రాహుల్ ఉన్నారు.
మరి వరుణ్ అక్క ప్రియాంకా గాంధీ యూపీలో పాగా వేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ని అక్కడ బతికించాలని ఆమె తపన పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరుణ్ గాంధీ రాజకీయం కూడా యాంటీ మోడీ అని తేలుతున్న వేళ ఈ ముగ్గురు గాంధీలు కలిసిపోతారా అన్న చర్చ అయితే ఉంది. నిజానికి వరుణ్ గాంధీ ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారు. కొన్ని విషయాల్లో ఆయన దూకుడుగా ఉంటారు.
నాలుగు పదుల వయసులో ఉన్న ఈ యువ నాయకుడు గాంధీ కుటుంబంలో చిన్న అయినా చాలా విషయాల్లో మిన్న. బీజేపీలో ఉంటూ వచ్చిన వరుణ్ ఆ పార్టీ గుట్టూ మట్టూ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటే గాంధీల పవర్ నిలబడుతుంది. మోడీకి గట్టి పోటీ కూడా ఇచ్చినట్లు అవుతుంది. కానీ రాహుల్ గాంధీతో వరుణ్ గాంధీకి ఈ రోజుకు అయితే సన్నిహిత సంబంధాలు లేవు.
ఇక మేనకాగాంధీ సోనియాగాంధీల మధ్య ఉన్న విభేధాలు కూడా అన్నదమ్ముల మధ్య కలయికకు ఇబ్బందులుగా మారుతున్నాయి. ఏది ఏమైనా తమ్ముడు వరుణ్ బీజేపీలో ఉంటూ ఢీ కొడుతూంటే అన్న రాహుల్ బయట నుంచి నరుక్కు వస్తున్నాడు. రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్ కి గాంధీలే శరణ్యమని తేలుతున్న వేళ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి రాహుల్ వరుణ్ చెట్టాపట్టాలు వేసుకుంటారో లేదో.