Begin typing your search above and press return to search.

బ్లేడ్‌ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్‌ వార్‌ తో బెజవాడలో హై టెన్షన్‌

By:  Tupaki Desk   |   3 March 2023 8:31 PM GMT
బ్లేడ్‌ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్‌ వార్‌ తో బెజవాడలో హై టెన్షన్‌
X
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బ్లేడ్‌ బ్యాచ్ ల మధ్య జరిగిన గ్యాంగ్‌ వార్‌ స్థానికంగా భయాందోళనకు గురి చేస్తోంది. గురువారం రాత్రి మొదలైన గ్యాంగ్‌ వారు శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా కూడా గ్యాంగ్‌ వార్ సర్ధుమనగక పోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... గురువారం రాత్రి గంజాయి సేవించిన గని అనే బ్లేడ్‌ బ్యాచ్ సభ్యుడికి ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే మరో బ్లేడ్‌ బ్యాచ్ సభ్యుడితో గొడవ జరిగింది. గంజాయి సేవించి గొడవకు దిగిన గని ని కొట్టిన హరి బ్యాచ్ సభ్యులు స్థానిక పోలీసులకు అప్పగించారు.

తమ సభ్యుడిని కొట్టి పోలీసులకు అప్పగించారనే కోపంతో గని బ్యాచ్ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ హరి బ్యాచ్ సభ్యులపై విచక్షణ రహితంగా బ్లేడ్స్ తో దాడులు చేశారు. ఆంజనేయ వాగు సెంటర్‌ కొండ ప్రాంతంలో గని బ్యాచ్ సభ్యులు అఖిల్ మరో అయిదు ఆరుగురు హరి బ్యాచ్‌ పై దాడి చేయడం జరిగింది.

ప్రశాంతంగా ఉన్న విజయవాడలో మళ్లీ ఈ గ్యాంగ్‌ వార్స్ మొదలు అవ్వడం తో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాల క్రితం విజయవాడ గ్యాంగ్‌ వార్స్ కు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇంతలో ఇలా జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌ వార్ ఎంత దూరం పోతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.