Begin typing your search above and press return to search.

పార్టీలో చేరతాడనుకుంటే షాకిచ్చాడే.. గంట మదిలో ఏముందో..

By:  Tupaki Desk   |   18 Feb 2020 8:00 AM GMT
పార్టీలో చేరతాడనుకుంటే షాకిచ్చాడే.. గంట మదిలో ఏముందో..
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లో, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాస రావు మంత్రిగా పని చేశారు. ఆయన రాజకీయమే అంతా. అధికార పార్టీలో ఉండడమే అతడి లక్ష్యం. తొలి నుంచి అదే వైఖరి కొనసాగిస్తున్నారు. అయితే ఈసారికొచ్చేసరికి ఆయన అధికార పార్టీలో చేరలేదు. గతంలోనే వైఎస్సార్సీపీలో గంటా చేరుతారనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఎటు తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీని వదలడం లేదు. తాజాగా ఆయన బీజేపీలో చేరనున్నాడు.. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. చేరిక లాంఛనమే అని అందరూ ఖరారయ్యారు. అయితే దానికి విరుద్ధంగా ఇప్పుడు బీజేపీ నుంచి టీడీపీ లోకి నాయకులను ఆహ్వానిస్తున్నారు. దీంతో బీజేపీ కి షాకివ్వడమే కాకుండా అతడి వైఖరి ఏమిటో అర్థం కావడం లేదు.

ఇటీవల విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన 300 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను గంటా శ్రీనివాస రావు పచ్చ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు చెప్పారు. ప్రస్తుత చేరికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు. అయితే ఈనెల 19వ తేదీ నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు తాను ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా చేరికలపై స్పందిస్తూ.. తాము టార్గెట్ చేసి ఎవరినీ తమ పార్టీలోకి చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు లో అన్ని పార్టీల నుంచి చేరికలుంటాయని తెలిపారు.

అంటే తనను ఆహ్వానించిన పార్టీలను దెబ్బకొడతానని ఆయన పరోక్షంగా హెచ్చరించాడు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ లో భాగంగా మూడు రాజధానుల్లో విశాఖపట్టణం కూడా ఉంది. మరి ఇదే విశాఖ కు చెందిన గంటా శ్రీనివాస రావు ఏమాత్రం స్పందించడం లేదు. విశాఖను రాజధాని చేయడం తో అధికార పార్టీలోకి గంటా చేరతాడని అందరూ భావిస్తున్నారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.