Begin typing your search above and press return to search.
ఇరు పార్టీలకు షాకిచ్చిన గంటా..స్థానికంగా బలోపేతంపై ఫోకస్
By: Tupaki Desk | 25 Feb 2020 7:15 AM GMTఅధికారం లేకుండా విశాఖ పట్టణం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస రావు ఉండలేరు. అందుకే పార్టీలు మారుస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోతాడు. గతంలో ఈ విధంగానే జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో చేరి చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గంటా చేరి మంత్రి అవుతాడని అందరూ భావించారు. ఆ విధంగా కొన్ని పరిణామాలు కూడా జరిగాయి. అయితే అకస్మాత్తుగా వెనకడుగు వేశారు. బీజేపీ లో చేరుతారని పుకార్లు వచ్చాయి. అయితే ఆ పార్టీని కూడా కాదని సొంత పార్టీనే మేలు అని నిర్ణయించుకుని సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల రెండు అధికార పార్టీలు అంటే వైఎస్సార్సీపీ - బీజేపీలకు గంటా షాక్ ఇచ్చారు.
తన నియోజకవర్గంలో బీజేపీ - వైఎస్సార్సీపీల నుంచి టీడీపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. సొంత పార్టీ టీడీపీని బలోపేతం చేసే దిశగా.. స్థానిక సంస్థలు రాబోతుండడంతో ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ఆ రెండు పార్టీల నాయకులు - కార్యకర్తలను టీడీపీలోకి చేర్చుకుంటున్నార. తాజాగా బీజేపీ నుంచి 300 మందిని గంటా టీడీపీలో చేర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రానుండడంతో ఇప్పటి నుంచే గంటా శ్రీనివాస్ రావు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే చేరికలకు తెరలేపారు. అయితే ఆయన ఏయే పార్టీల్లోకి వెళ్తారని పుకార్లు వచ్చాయో.. అవే పార్టీల నాయకులు - కార్యకర్తలను గంటా తన పార్టీలోకి చేర్చుకోవడం గమనార్హం.
అధికార వికేంద్రీకరణలో భాగంగా జగన్ మూడు రాజధానులను ప్రకటించగా అందులో విశాఖపట్టణం కీలక రాజధానిగా మారనుంది. అయితే ఈ నిర్ణయాన్ని గంటా శ్రీనివాస రావు స్వాగతించారు. ఈ ప్రకటనతో గంట అధికార పార్టీలోకి జంపవుతాడని అందరూ అనుకున్నారు. అయితే ఆ పార్టీ గంటాకు నో వెకెన్సీ అని చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే విశాఖ జిల్లా అధికార పార్టీ లో కీలక నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అవంతి శ్రీనివాస రావు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మంత్రి గా కొనసాగుతున్నారు. దీంతో అవంతి గంటా ను వ్యతిరేకిస్తుండడంతో అధికార పార్టీ అతడి రాకకు పచ్చజెండా ఊపలేదు. ఇక బీజేపీలో చేరాలనుకున్న సమయంలో భవిష్యత్ లో ఇబ్బందులు ఏర్పడతాయని, ఆ పార్టీ అంత బలం లేదని ఊహించి ఉన్న పార్టీనే బెస్ట్.. అని భవిష్యత్ లో టీడీపీ కి మంచి రోజులు వస్తాయనే భావనతో ఆ పార్టీలో చేరలేదు. ప్రస్తుతం టీడీపీ ని బలోపేతం చేసే పని లో పడ్డారు.